కేసీజీ విద్యార్ధికి ఐఈటీ స్కాలర్‌ షిప్‌ అవార్డు | - | Sakshi
Sakshi News home page

కేసీజీ విద్యార్ధికి ఐఈటీ స్కాలర్‌ షిప్‌ అవార్డు

Dec 22 2025 2:18 AM | Updated on Dec 22 2025 2:18 AM

కేసీజీ విద్యార్ధికి ఐఈటీ స్కాలర్‌ షిప్‌ అవార్డు

కేసీజీ విద్యార్ధికి ఐఈటీ స్కాలర్‌ షిప్‌ అవార్డు

సాక్షి, చైన్నె: కేసీజీ కళాశాల విద్యార్థిని ఎస్‌కే రితిక 9వ ఐఈటీ ఇండియా స్కాలర్‌ షిప్‌ అవార్డును దక్కిందచుకున్నారు. సౌరశక్తితో పనిచేసే ఆరోగ్య సంరక్షణ అంశాల పరిష్కారం దిశగా సాగినపరిశోధనకు ఈ అవార్డు ఆమెకు దక్కింది. సాంకేతిక పర్యావరణ వ్యవస్థలోయువ మహిళా ఇంజినీర్ల ప్రతిభ, నాయకత్వం, ప్రభావం, ఐఈటీ ఇండియా 2025 స్కాలర్‌ షిప్‌ ఎడిషన్‌ అవార్డుల కార్యక్రమం స్థానికంగా జరిగింది. ఇందులో ప్రపథమంగా ఐదుగురిని జాతీయ స్థాయి ఫైనలిస్టులుగా నారీ లోకాన్ని ఎంపిక చేశారు. వీరికి రూ. 10 లక్షల స్కాలర్‌ షిప్‌ను అందజేశారు. ఇందులో సౌరశక్తితో పనిచేసే ఆరోగ్య సంరక్షణ పరిష్కార అన్వేషనలో కేసీజీ విద్యార్థిని ఎస్‌కే రితిక విజేతగా స్కాలర్‌ షిప్‌ అవార్డును సొంతం చేసుకున్నారు. కళింగ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ టెక్నాలజీకి చెందిన వంశికా జావర్‌ తొలి రన్నరప్‌గా ఎంపికయ్యారు. ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ నుంచి ఖుషీ మల్హోత్రా రెండవ రన్నర్‌గా నిలిచారు. వీరికి ఐఈటీ ఇండియా స్కాలర్‌ షిప్‌ అడ్వయిజర్‌ కమిటీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ అభిజిత్‌ చక్రబర్తి ఐఈటీ స్కాలర్‌ షిప్‌ అవార్డులను అందజేశారు.

కాంగ్రెస్‌లోకి

ఈవీకేఎస్‌ మనవరాలు

సాక్షి, చైన్నె : కాంగ్రెస్‌ పార్టీలోకి దివంగత సీనియర్‌ నేత ఈవీకేఎస్‌ ఇలంగోవన్‌ మనవరాలు చేరారు. ఢిల్లీలో ఆమె కాంగ్రెస్‌ అధినేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీలను ఆదివారం కలిశారు. ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్‌ కుటుంబం నుంచి రాజకీయాలలో ఈవీకేఎస్‌ ఇలంగోవన్‌ రాణించిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రిగా, కాంగ్రెస్‌ సీనియర్‌నేతగా, ఎమ్మెల్యేగా వ్యవహరించారు. తనయుడు, ఎమ్మెల్యే తిరుమగన్‌ ఈవేరా 2003లో మరణించగా గత ఏడాది ఈవీకేఎస్‌ కూడా కన్నుమూశారు. ఈరోడ్‌ తూర్పు నియోజకవర్గం ఇది వరకు ఈవీకేఎస్‌ కుటుంబం కంచుకోటగా ఉండేది. ప్రస్తుతం ఇక్కడ బలమైన కాంగ్రెస్‌ నేత లేకపోవడంతో ఈ స్థానాన్ని డీఎంకే తన ఖాతాలో వేసుకుంది. ఈ నియోజకవర్గంలో మళ్లీ ఈవీకేఎస్‌ కుటుంబ రాజకీయం మొదలు కానున్నది. ఇందుకు అద్దం పట్టే విధంగా ఆయన మనవరాలు, తిరుమగన్‌ ఈవేరా కుమార్తె సమన్నా కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈమె గుర్రపు స్వారీలో ఆరి తేరి రైడర్‌గా జాతీయ స్థాయిలో పతకాలను సాధించి ఉన్నారు. తాజాగా ఆమె తన తాత , తండ్రి బాటలో రాజకీయాలలోకి అడుగు పెట్టారు. ఢిల్లీలో సోనియా గాంధి, రాహుల్‌ గాంధి, ప్రియాంక గాంధి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తాతయ్య, తండ్రి అడుగు జాడలలో కష్ట పడి పనిచేస్తానని వారికి హామీ ఇచ్చారు.

కీచక డాక్టరు!

అనస్తీషియా ఇచ్చి విద్యార్థినిపై లైంగిక దాడి

సాక్షి, చైన్నె : రోగులకు వైద్యం చేయాల్సిన డాక్టరు కామాంధుడయ్యాడు. శీతల పానీయంలో అనస్తీషియా మందును కలిపి ఇచ్చి మత్తులోకి వెళ్లిన తన వద్ద పనిచేసే ఫిజియో థెరఫిస్టయిన విద్యార్థినిపై లైంగిక దాడి చేశాడు. వివరాలు.. చైన్నె కొడంగయూరుకు చెందిన 22 ఏళ్ల విద్యార్థి ఓ వైద్య కళాశాలలో ఫిజియో థెరపి నాలుగో సంవత్సరం చదువుతున్నారు. కళాశాల ముగియగానే ఆమె పెరంబూరులో డాక్టర్‌ కార్తికేయన్‌(27)కు చెందిన ఫిజియోథెరఫి క్లీనిక్‌లో ట్రైనీగా పనిచేస్తూ వస్తున్నారు. డాక్టరు సూచన మేరకు రోగుల ఇళ్ల వద్దకు వెళ్లి మరీ ఫిజియోథెరపీ చేయిస్తూ వచ్చారు. శనివారం ఉదయం కొంతమంది రోగుల ఇళ్ల వద్దకు వెళ్లాల్సి ఉందంటూ ఆ విద్యార్థినిని కార్తికేయన్‌ పిలిపించాడు. తన కారులో ఆ విద్యార్థిని ఎక్కించుకుని ఇద్దరు రోగుల ఇళ్లకు వెళ్లాడు. చివరకు కొళత్తూరులోని జయంతి నగర్‌లోని ఓ పార్లర్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను టీ లేదా కాపీ తీసుకోవాలని సూచించాడు. తనకు అలవాటు లేదని చెప్పడంతో చివరకు తన కారులో ఉన్న కూల్‌ డ్రింక్స్‌ అయినా తాగమని సూచించాడు. కారులో ఉన్న ఆ డ్రింక్‌ను తాగిన కాసేపటికి ఆ విద్యార్థిని స్పహ తప్పింది. దీంతో కారులో ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. సాయంత్రం సమయంలో స్పృహలోకి వచ్చిన ఆ విద్యార్థిని తన బట్టలన్నీ చిందర వందరగా ఉండడంతో అక్కడి నుంచి తప్పించుకుని బంధువులకు సమాచారం అందించింది. వారు సెంబియం పోలీసులను ఆశ్రయించారు. ఆ విద్యార్థిని రాత్రి సమయంలో ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమైపె డాక్టరు లైంగిక దాడి జరిపినట్లు వెలుగు చూసింది. ఆమెను చికిత్స నిమిత్తం ఓ ఆస్పత్రిలో అనుమతించారు. ఆందోళన చెందిన డాక్టరు పరారీ అయ్యేందుకు యత్నించగా పోలీసులు అప్రమత్తమైన అర్ధరాత్రి సమయంలో కొళత్తూరు మహిళా పోలీసులు అరెస్టు చేశారు. ఆ విద్యార్థినికి కూల్‌ డ్రింక్‌లో అనస్థీయా కలిపి ఇవ్వడంతోనే మత్తులోకి వెళ్లినట్టు, ఆ తర్వాత ఆమైపె లైంగిక దాడికి పాల్పడినట్టు విచారణలో తేలింది. పోక్సో చట్టం కింద అతడ్ని అరెస్టు చేసి ఆదివారం కటకటాలలోకి నెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement