కమనీయం.. రథోత్సవం
వఠారన్నేశ్వరర్ కమల రధోత్సవంలో పాల్గొన్న భక్తజనం
వఠారన్నేశ్వరర్ ఆలయ కమల రథోత్సవం సోమవారం వేలాదిమంది భక్తజనం శివనామస్మరణ నడుమ కమనీయంగా సాగింది. రథంలో వండార్‌కుయళి సమేత సూమాస్కందర్ ఉత్సవర్లు కొలువుదీరారు. రథం వీధిలో వేలాది మంది భక్తులు గుమిగూడగా శివపార్వతుల వేషధారణలో కళాకారులు, శివభూత వాయిద్యాల నడుమ మధ్య రథం కదిలింది. ఈ సందర్భంగా భక్తులు రథం లాగి ఉప్పు, మిరియాలు వెదజెల్లి తమ మొక్కులు చెల్లించారు. భక్తులకు పలు ప్రాంతాల్లో మజ్జిగ, జ్యూస్, తాగునీరు సరఫరా చేశారు. జిల్లా ఎస్పీ శ్రీనివాస పెరుమాళ్ ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు బందోబస్తు చేపట్టారు. తిరుత్తణి ఆలయ జాయింట్ కమిషనర్ రమణి ఆధ్వర్యంలో ఆలయ ట్రస్టీలు సురేష్‌బాబు, ఉషారవి ఏర్పాట్లను పర్యవేక్షించారు.– తిరుత్తణి
కమనీయం.. రథోత్సవం


