సేలం: ఆత్తూర్‌లోని ప్రైవేటు పాఠశాల బస్సును తండ్రి రివర్స్ తీసుకున్న సమయంలో ఆ బస్సు కింద పడి తీవ్రంగా గాయపడిన కుమారుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. సేలం జిల్లా ఆత్తూర్ సమీపంలో ఉన్న కీరిపట్టి మేల్ కనవాయ్ ప్రాంతా నికి చెందిన వ్యక్తి రాజవేల్ (24) ప్రైవేట్ పాఠశాల బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి కుమారుడు యోకిత్ రాజ్ (ఒకటిన్నర వయస్సు) ఉ న్నాడు. రాజవేల్ ఎప్పటిలాగే బుధవారం సాయంత్రం విద్యార్థులను ఇళ్లలో దిగిబెట్టి రాత్రి తన ఇంటికి వెళ్లాడు. తర్వాత గురువారం ఉదయం పాఠశాలకు విద్యార్థులను తీసుకువెళ్లడానికి ఇంటి ముందు ఉంచిన బస్సును రాజవేల్ తీశాడు. ఆ సమయంలో బ స్సును రివర్స్ తీయగా బస్సు వెనుక ఉన్న కుమారుడు యో కిత్ రాజ్ దాని కిందపడి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కాగా కన్న తండ్రి చేతిలోనే కుమారుడు మృతి చెందిన ఘటన ఆ ప్రాంతంలో విషాదం నింపింది.