తమిళసినిమా: నటుడు అజిత్ కథానాయకుడిగా నటించిన చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. నటి త్రిష నాయకిగా నటించిన ఇందులో నటుడు ప్రసన్న, అర్జున్‌దాస్ ముఖ్యపాత్రలు పోషించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 10న తెరపైకి రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన పలు హైలెట్స్ ఇప్పుటికే విడుదలై అంచనాలు పెంచేశాయి. చిత్రంలో అజిత్ గెటప్ నుంచి, టైటిల్, టీజర్, ఫస్ట్‌లుక్ పోస్టర్ వంటివి అజిత్ అభిమానుల్లో ఆసక్తిని పెంచేశాయి. అసలు ఇందులో అజిత్ ఎన్ని పాత్రలు పోషించారన్నది కూడా ఆసక్తిగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం తండ్రీ కొడుకుల మధ్య సాగే కథా చిత్రంగా ఉంటుందని తాజా సమాచారం. ఇందులో అజిత్ కొడుకుగా నటుడు తెలుగు నటుడు కార్తీకేయ నటించినట్లు తెలిసింది. వీరిద్దరి మధ్య ఎమోషనల్ సన్నివేశాలు చోటు చేసుకుంటాయని తెలిసింది. కాగా చాలా కాలం క్రితం అజిత్ కథానాయకుడిగా నటించిన వరలారు చిత్రంలో కార్తీకేయ బాలనటుడిగా నటించారు. ఆ తరువాత ఇటీవల విడుదలైన వలిమై చిత్రంలో అజిత్‌కు విలన్‌గా నటించారు. తాజాగా మరోసారి గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో నటించారన్నమాట. కాగా అజిత్ నటించిన విడాముయర్చి చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. దీంతో గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం విజయం సాధించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.