తిరుపతి కల్చరల్: త్యాగరాజ మండపంలో బుధవారం రాత్రి చైన్నెకి చెందిన ఎస్.ఐశ్వర్య, ఎస్.సౌందర్య అన్నమయ్య సంకీర్తనలను సుమధురంగా గానం చేసి సభికులను శ్రవణానందభరితుల్ని చేశారు. శ్రీత్యాగరాజ స్వామి కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో త్యాగరాజ మండపంలో చేపట్టిన అన్నమాచార్య సంకీర్తనోత్సవాలు బుధవారంతో రెండవ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా వీరు అన్నమయ్య కీర్తనల స్వలాపనతో భక్తులను అలరింపజేశారు. వీరికి మృదంగంపై కొత్తపల్లి రమేష్, ఘటంపై ఎల్.స్రసాద్, వయోలిన్‌పై కొమండూరి కృష్ణ చక్కటి సహకారం అందించి రక్తి కట్టించారు.