సాక్షి, చైన్నె: కావేరి హాస్పిటల్ నేతృత్వంలో కొలాబరేటివ్ ఆఫ్ ఇండియన్ రుమటాలజీ ఎడిటర్స్(సీఐఆర్‌ఈ) మెడికల్ అకాడెమిక్ పబ్లిషింగ్ పై మొదటి అంతర్జాతీయ సదస్సు మంగళవారం జరిగింది. ఆళ్వార్ పేటలోని కావేరిఆస్పత్రిలో జరిగిన ఈ సదస్సులో మెడికల్ అకడమిక్ పబ్లిషింగ్, వైద్య సంబంధిత అంశాలగురించి చర్చించి అద్భుతమైన విజయాన్ని సాధించారు. ఇందలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులు, పరిశోధకులు, నిపుణులను ఒకచోట చేర్చి వైద్య పరిశోధన , ప్రచురణలో తాజా పోకడలలో సవాళ్లను గురించి చర్చించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి 250 మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సుకుహాజరయ్యారు. నగర వైద్య కళాశాలల నుంచి యువ అండర్ గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఈ కార్యక్రమానికి వచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత అంతర్జాతీయ, జాతీయ జర్నల్స్ ఎడిటర్–ఇన్–చీఫ్ , తైవాన్‌లోని చుంగ్ షాన్ మెడికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ , సీనియర్ డిజిటల్ హెల్త్ కన్సల్టెంట్‌లు, సింగపూర్‌లోని మెలాంజ్ కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకులు తమ అనుభవాన్ని జ్ఞానాన్ని పంచుకున్నారు. భారతీయ నిపుణులలో డాక్టర్ సమిరాన్ పాండా ప్రత్యేక ప్రసంగంచేశారు. ఇక మాన్యుస్క్రిప్ట్ రచన. సమీక్షపై పాల్గొనేవారికి ఆచరణాత్మక అనుభవాన్ని అందించే రెండు చిన్న వర్క్‌షాప్‌లు నిర్వహించారు. కన్సల్టెంట్ రుమటాలజిస్ట్ డాక్టర్ మోహిత్ గోయల్ నేతృత్వంలో సంపాదకీయ ప్రక్రియ, ప్రచురణ, వివిధ అంశాలను ప్రస్తావించారు. మొదటి అంతర్జాతీయ మెడికల్ అకాడెమిక్ పబ్లిషింగ్ సింపోజియంను నిర్వహించడం ఒక ప్రత్యేకమైన అనుభవం, ఎందుకంటే మేము ప్రముఖ అంతర్జాతీయ, జాతీయ జర్నల్స్ నుంచి ఎడిటర్లను యువ మనస్సులతో (అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు) అలాగే వైద్య కళాశాలల నుంచి అధ్యాపకులతో సంభాషించడానికి తీసుకువచ్చామని ఈసందర్భంగా నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కావేరీ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ అయ్యప్పన్ పొన్నుస్వామి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మహేష్ కుమార్, క్లినికల్ లీడ్ – చీఫ్ కన్సల్టెంట్ ఫిజీషియన్ డాక్టర్ శివరామ్ కన్నన్ అధ్యక్షత వహించారు. వీరు అంతర్జాతీయ అధ్యాపకులను సత్కరించారు. సహ వ్యవస్థాపకులు డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్ తమ మొదటి అంతర్జాతీయ వైద్య విద్యా ప్రచురణపై సింపోజియంను విజయవంతంగా నిర్వహించడం గురించి వివరించారు.