కొరుక్కుపేట: ప్రముఖ సామాజిక కార్యకర్త అప్సరరెడ్డి నేతృత్వంలో వివిధ రంగాల్లో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న మహిళలకు హ్యూమానిటేరియన్ అవార్డుతో సత్కరించే కార్యక్రమం చైన్నెలో ఘనంగా జరిగింది. ఎన్‌ఏసీ సంస్థ సమర్పణలో జరిగిన వేడుకలో అప్సరరెడ్డి నిర్వహించే హ్యుమానిటేరియన్ అవార్డ్ ఫర్ ఉమెన్స్ ఎక్సలెన్స్ పేరుతో అవార్డులను ప్రదానం చేశారు. నిర్మాణ దార్శనికురాలు గౌరీ అడప్ప, విద్యావేత్త సింధుర అరవింద్, అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన మేకప్ ఆర్టిస్ట్ కార్తీక, పిల్లల దంత వైద్య నిపుణురాలు నిలయ, తమిళనాడు జంతు సంక్షేమ బోర్డు సభ్యురాలు శ్రుతి,విద్యావేత్త శుభదాదా, కోటా చీరల వారసత్వ విజేత పూజా సింఘి, సీనియర్ జర్నలిస్ట్ సీఎస్‌ఎస్ లత, రెడ్‌వుడ్ మాంటిస్సోరి మధుర విశ్వేశ్వరన్, టారో నిపుణురాలు అన్నపూర్ణ అభినేష్ అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా అప్సర రెడ్డి మాట్లాడుతూ విభిన్న రంగాలలో రాణించడమే కాకుండా సమాజానికి అర్థవంతంగా దోహదపడే మహిళలను గుర్తించి ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా తమకు సహకరిస్తున్న ఎన్‌ఏసీ ఆనంద్ రామానుజంకు ధన్యవాదాలు తెలిపారు.