బడ్జెట్ చర్చ..
జరిమానాల జోరు
నేడు ఆటోవాలాల బంద్
● రెండున్నర నెలలో 82 వేల కేసులు
సాక్షి, చైన్నె: అసెంబ్లీ సమావేశాలలో సోమవారం స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం చర్చ సాగిన విషయం తెలిసిందే. ఇందులో స్పీకర్ నెగ్గారు. ఈ పరిస్థితుల లో మంగళవారం సభ ప్రారంభం కాగానే, స్పీకర్ అప్పావు ప్రశ్నోత్తరాలకు సమయం కేటాయించా రు. ఈసందర్భంగా పలువురు సభ్యుల ప్రశ్నలకు మంత్రులు దురై మురుగన్, కేఎన్ నెహ్రూ, శేఖర్ బాబు, ఏవీ వేలు, అన్బరసన్, స్వామినాథన్, తంగం తెన్నరసు, సెంథిల్ బాలాజీ, గీతాజీవన్ తదితరులు సమాధానాలు ఇచ్చారు. చెక్ డ్యాంల నిర్మాణాలు, రిజర్వాయర్లకు మరమ్మతులు వంటి అనేక అంశాలపై సభ్యుల ప్రశ్నలకు మంత్రి దురైమురుగన్ సమాధానం ఇస్తూ, పరిశీలిస్తామని, అమలు చేస్తామని పేర్కొన్నారు. తామర భరణి నదీ తీరంలో చెక్ డ్యాంల నిర్మాణానికి ప్రాధాన్యతను ఇవ్వనున్నట్టు ప్రకటించారు. మంత్రి ఏవీ వేలు పేర్కొంటూ, రహదారులలో పెట్రోల్ బంకుల రూపంలో ప్రమాదాలు పెరుగుతున్నాయని, అందుకే ఆయా ప్రాంతాలలో డివైడర్లను ఏర్పాటు చేసి, కొంత దూరం తర్వాత యూటర్న్‌కు అవకాశం కల్పిస్తున్నామని ఓ సభ్యుడి ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. మదురైలోని కప్పలూరు టోల్‌గేట్ ఎత్తివేత లక్ష్యంగా కేంద్రంతో తాము సైతం పోరాడుతూనే ఉన్నామని, ఈ ప్రయత్నం కొనసాగుతుందని అన్నాడీఎంకే శాసనసభా పక్ష ఉప నేత ఆర్‌బీ ఉదయకుమార్ ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. మంత్రి అన్బరసన్ పేర్కొంటూ, మునగ పౌడర్ తయారీ నిమిత్తం పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చే పరిశ్రమలకు సంపూర్ణ మద్దతును ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. వెయ్యేళ్ల పురాతన ఆలయాలన్నింటికి జీర్ణోద్ధరణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ. 100 కోట్లుకేటాయించిందని మంత్రి శేఖర్‌బాబు వివరించారు.
అవ్వ‘యార్’..
సభలో తమిళ కవయిత్రి అవ్వైయార్ చర్చ ఆసక్తికరంగా జరిగింది. అన్నాడీఎంకే సీనియర్ సభ్యుడు ఓఎస్ మణియన్ తన ప్రసంగంలో తన నియోజకవర్గం పరిధిలోని తులసీయా పట్నంలో అవ్వైయార్‌కు రూ. 13 కోట్లతో మణి మండపం పనులు జరుగుతున్నాయని గుర్తు చేశారు. ఇక్కడ అవ్వై విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు మంత్రి స్వామినాథన్ సమాధానం ఇస్తూ, నిధుల ఆధారంగా తదుపరి చర్యలు అని వ్యాఖ్యానించారు. ఇందుకు నిధులు అవశ్యం లేదని పుస్తకాలు ఉంటే చాలంటూ ఓఎస్ మణియన్ వ్యాఖ్యానించారు. ఈ సమయంలో అవ్వయార్( అవ్వ ఎవరు) అన్న చర్చ ఊపందుకుంది. ఓఎస్ మణియన్ వ్యాఖ్యలకు మంత్రి దురై మురుగన్ స్పందిస్తూ అందరి ఇళ్లల్లో ఉండే అవ్వ అంటూ చమత్కరించారు. అవ్వైయార్ ఒకరు కాదు..ఐదుగురు అని పరిశోధకులు పేర్కొంటున్నారని, ఇప్పుడు ఏ అవ్వైయార్ గురించి చెబుతున్నారో అని చలోక్తులు విసిరారు. తన నియోజకవర్గంలో ఏ అవ్వైయార్‌కు మణి మండపం నిర్మిస్తున్నారో ఆమెకే అంటూ ఓఎస్ మణియన్ సమాధానం ఇచ్చారు. అలాగే అప్పట్లో భక్తి పాటులు, కవితలు రాసే పురుషులను పులవర్లు అని పిలిచే వారని, అదే విధంగా మహిళలను అవ్వైయార్ అని పిలిచే వారని గుర్తు చేశారు. ఈసమయంలో మంత్రి తంగం తెన్నరసు జోక్యం చేసుకుని, ప్రస్తుతం కొత్త చర్చ తెర మీదకు వచ్చిందని, అవ్వైయార్ అన్నది పక్కన నెట్టబడి అవ్వ యార్ అన్న ప్రశ్నల నెలకొందన్నారు. అయితే అవ్వైయార్ అన్నది మహిళలకు ఒక చిహ్నం అని ఆ పేరుతో విజ్ఞాన కేంద్రం ఏర్పాటు అవశ్యం ఉందన్నారు. సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈసందర్భంగా మైనారిటీ నేత, ఎమ్మెల్యే జవహిరుల్లా తన నియోజకవర్గం పరిధిలోని స్వామి మలై మురుగన్ ఆలయంలో లిప్ట్ ఏర్పాటు పనులు ఎప్పుడు ముగుస్తాయో అని ప్రశ్నించారు. ఇందుకు మంత్రి శేఖర్‌బాబు సమాధానం ఇస్తూ, జూన్ నాటికి అందరం కలిసి ప్రారంబ్ధిద్దామన్నారు. మైనారిటీ ఎమ్మెల్యే హిందీ ఆలయం అభివృద్ధి విషయంలో ప్రశ్నించారని, ఇదే తమిళనాడులో ఉన్న ఐక్య త అని మంత్రి వ్యాఖ్యానించారు.
న్యూస్‌రీల్
ఢిల్లీ విమానంలో సాంకేతిక లోపం
కొరుక్కుపేట: చైన్నె నుంచి బయలుదేరి ఢిల్లీ విమానంలో ఆకస్మిక సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో విమానం రన్ వే పైనే ఆగిపోయింది. వివరాలు.. మంగళవారం తెల్లవారుజామున 2.30 గంటలకు చైన్నె నుంచి బయలుదేరిన ఈ విమానంలో 142 మంది ప్రయాణికులుతో కలిపి 148 మంది విమాన సిబ్బంది ఉన్నారు. విమానం టేకాఫ్ ప్రారంభించగానే విమానంలో సాంకేతిక లోపం ఉన్నట్లు పైలట్ గుర్తించారు. వెంటనే విమానాన్ని రన్ వేపై అత్యవసరంగా నిలిపివేసి, ఎయిర్‌పోర్ట్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. దీని తర్వాత టోయింగ్ వాహనంతో పార్కింగ్ స్థలం వద్దకు తీసుకొచ్చి ఆపారు. సాంకేతిక లోపాన్ని సరిదిద్దడంతో విమానం తెల్లవారుజామున 4 గంటలకు ఢిల్లీకి బయలుదేరింది. దీంతో ప్రయాణికులు సమయానికి వెళ్లలేక అవస్థలు పడ్డారు.
లండన్, హైదరాబాద్‌లకు
విమానాలు రద్దు
అదే విధంగా లండన్ నుంచి రోజూ తెల్లవారుజామున 5.35 గంటలకు బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానం చైన్నె అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటుంది..
ఈ క్రమంలో లండన్ నుంచి మంగళవారం చైన్నె చేరుకోవాల్సిన బ్రిటిష్ ఎయిర్ విమానం అకస్మాత్తుగా రద్దయ్యింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదేవిధంగా బ్రిటిష్ ఎయిర్‌వేస్ రోజూ ఉదయం 7.45 గంటలకు చైన్నె నుంచి లండన్‌కు బయలుదేరుతుంది. మంగళవారం ప్యాసింజర్ ఫ్లైట్ కూడా రద్దు చేశారు. అలాగే హైదరాబాద్ నుంచి చైన్నె దేశీయ విమానాశ్రయానికి ఉదయం 11.10 గంటలకు అలయన్స్ ఎయిర్‌లైన్స్ ప్యాసింజర్ విమానం కూడా మంగళవారం బయలుదేరుతుంది. ఈ విమానం కూడా అధికారులు రద్దు చేశారు. అదే విధంగా చైన్నె నుంచి మధ్యాహ్నం 12 గంట లకు హైదరాబాద్‌కు వెళ్లే ఫ్లైట్ కూడా రద్దయ్యింది. కాగా ఈమేరకు ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని చైన్నె విమానాశ్రయ అధికారులు తెలిపారు.
అధికార, ప్రతి పక్షాల మధ్య ఛలోక్తులు
అవ్వ‘యార్’ అంటూ కొత్త చర్చ
తెరమీదికి మళ్లీ ధర్మాకోల్
అసెంబ్లీలో బడ్జెట్ మీద చర్చ మంగళవారం ప్రారంభమైంది. తొలి రోజు ఆసక్తికర అంశాలతో చర్చ సాగింది. అధికార, ప్రతిపక్షాల మధ్య ఛలోక్తులు, వ్యంగ్యాస్త్రాలతో సభ రసవత్తరంగా సాగింది. కవయిత్రి అవ్వ‘యార్’ (అవ్వైయార్) గురించి కొత్త చర్చను తెరమీదకు తెచ్చారు. అలాగే నీటిపై ధర్మాకోల్ పరిచినంతంగా విమానాశ్రయ నిర్మాణం సులభతరం కాదన్న వ్యాఖ్యల తూటాలు పేలాయి.
బడ్జెట్ చర్చ సమయంలో మరింత ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి. మంత్రులు, ప్రతిపక్ష సభ్యులు పరస్పరం ఆరోగ్యకరమైన చలోక్తులను విసురుకున్నారు. ఈసమయంలో అన్నాడీఎంకే సీనియర్ నేత సెల్లూరు రాజు వ్యాఖ్యలకు మంత్రి టీఆర్‌బీ రాజ ఓ విషయంగా ఘాటుగానే సమాధానం ఇచ్చారు. నీరు ఆవిరి కాకుండా రిజర్వాయర్‌లో ధర్మా కోల్ పరిచినంత సులభంగా విమానాశ్రయాన్ని నిర్మించ లేమంటూ చమత్కరించారు. ఇందుకు సెల్లూరు రాజు పేర్కొంటూ, ఆ సమయంలో తాను అధికారులకు చెప్పే థర్మాకోల్ పరిచేందుకు వెళ్లినట్టు పేర్కొంటూ సభలో హాస్యపు జల్లులను పూయించారు. తర్వాత కాసేపు సెల్లూరురాజు, పలువురు మంత్రుల మధ్య ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై చర్చ వాడీవేడిగా సాగింది. ఈసమయంలో ప్రధాన ప్రతిపక్ష నేత పళణి స్వామి జోక్యం చేసుకుని విద్యా శాఖ అంశాలలో మాజీ విద్యాశాఖ మంత్రి, తమ పార్టీ సభ్యుడు సెంగోట్టయన్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్‌కు విన్నవించడం విశేషం. ఈ పరిణామంతో పళణి, సెంగోట్టయ్యన్ మధ్య సాగుతూ వచ్చిన వివాదం సమసినట్లయ్యింది. ఇదిలా ఉండగా, అసెంబ్లీ పరిసరాలలో గతంలో లేని విధంగా భద్రతను తాజాగా కట్టుదిట్టంచేశారు. టాస్మాక్‌లో ఈడీ దాడులు ఓ వైపు, దీనిపై సమగ్ర విచారణకు పట్టుబడుతూ బీజేపి ఆందోళనలు సాగుతున్న నేపథ్యంలో ఈ భద్రతను పెంచారు. ఈడీ అధికారులు గానీ, బీజేపీ వర్గాలు గానీ సచివాలయం వైపుగా రాకుండా నిఘా పటిష్టం చేశారు. గట్టి తనిఖీల అనంతరం లోనికి అనుమతిస్తున్నారు.
ఆసక్తికరంగా బడ్జెట్ చర్చ!
ఆసక్తికరంగా బడ్జెట్ చర్చ!