తిరుత్తణి: నొచ్చిలి రోడ్డులో ప్రమాదాలు అరికట్టేందుకు పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు వేణుగోపాలరాజు కోరారు. తిరుత్తణి ఆర్డీఓ కార్యాలయంలో శుక్రవారం ఆర్డీఓ దీప ఆధ్వర్యంలో రైతు సమస్యల పరిష్కార సభ నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్న సమావేశంలో తిరుత్తణి, పళ్లిపట్టు, తిరువలంగాడు, ఆర్కేపేట ప్రాంతాల నుంచి వందకు పైగా రైతులు పాల్గొన్నారు. జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు వేణుగోపాలరాజు మాట్లాడుతూ పళ్లిపట్టు ప్రాంతంలోని రాళ్లు, ఇసుక, గ్రావల్ క్వారీల నుంచి రోజూ వందలాది టిప్పర్లు, లారీలు నొచ్చిలి తిరుత్తణి రోడ్డులో వెళుతుంటాయి. భారీ వాహనాలు రోడ్డు నిబంధనలు పాటించకుండా అతివేగంతో పయనించడంతో పాటు అధికభారం తరలించడం, నిబంధనలకు విరుద్ధంగా రాత్రుల్లో వాహనాలు నడపడంతో తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుని వాహన చోదకులు, గ్రామీణులు ప్రాణాలు కోల్పోవాల్సి వుంది. పోలీసులు, ఆర్టీఓ చర్యలు తీసుకుని వాహన తనిఖీలు ముమ్మరం చేసి నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న వాహనాలు సీజ్ చేయాలని కోరారు.
ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోండి
ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోండి