– 10 మందికి తీవ్రగాయాలు
సేలం: విల్లుపురం జిల్లా దిండివనం సమీపంలో వరుసగా నాలుగు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. చైన్నె వైపు వెళుతున్న లోడు లారీ తెన్‌పాసరై వద్ద వెళుతుండగా సైక్లిస్ట్‌ను తప్పించే క్రమంలో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో లారీ వెనుక వస్తున్న మరొక లారీ, ప్రభుత్వ బస్సు, కారు వరుసగా ఒకదాని వెనుక ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వీరిని పోలీసులు సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రభుత్వాస్పత్రిలో పేలిన ఫ్రిడ్జ్
తిరుత్తణి: తిరుత్తణి ప్రభుత్వాస్పత్రిలోని ప్రసవ వార్డులో మందులు వుంచే ఫ్రిడ్జ్ పేలడంతో పొగ కమ్ముకుంది. వెంటనే గర్భిణులు, చంటి పిల్లల తల్లులను ఆస్పత్రి సిబ్బంది కాపాడడంతో పెను ప్రమాదం తప్పింది. తిరుత్తణి ప్రభుత్వాస్పత్రిలోని ప్రసవ వార్డులో 15 మంది గర్భిణులు, చంటి పిల్లల తల్లులు చికిత్స పొందుతున్నారు. ఈక్రమంలో శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో వార్డులోని మందులు నిల్వ వుంచే ఫ్రిడ్జ్ పేలడంతో పొగలు చోటుచేసుకున్నాయి. దీంతో గర్భిణులు, చంటి బిడ్డల తల్లులను అక్కడున్న ఆస్పత్రి సిబ్బంది కాపాడి సమీపంలోని వార్డుకు తరలించారు. అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు ఆస్పత్రికి చేరుకుని అత్యవసర ద్వారం అద్దాలు కూల్చి వార్డులో కమ్ముకున్న పొగలను శుభ్రం చేసి సకాలంలో స్పందించి గర్భిణులు, బాలింతలను కాపాడిన ఆస్పత్రి సిబ్బంది సేవలను వైద్యులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది కొనియాడారు.
వాహనం ఢీకొని
చిన్నారి దుర్మరణం
తిరువళ్లూరు: ఫోర్క్‌లిఫ్ట్ వాహనం ఢీకొని 8 నెలల చిన్నారి మృతిచెందిన సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. కల్లకురుచ్చి ప్రాంతానికి చెందిన చెల్లముత్తు, ప్రియారాణి దంపతులు తిరువళ్లూరుకు వచ్చి గత మూడు నెలల నుంచి ప్రయివేటు ఇటుక బట్టీలో పనిచేస్తున్నా రు. వీరికి భువనేశ్వరి అనే 8 నెలల చిన్నారి వుంది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ప్రియారాణి తన 8నెలల చిన్నారిని చెట్టు కింద పడుకోబెట్టి పనుల్లో నిమగ్నమైంది. ఈ సమయంలో ఇటుక రాయిని బట్టీ వద్దకు తీసుకొచ్చిన ఫోర్క్ లిఫ్ట్ అపరేటర్ నిర్లక్ష్యంగా వాహనా న్ని నడపడంతో చెట్టు కింద నిద్రిస్తున్న చిన్నారి పై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే మృతిచెందింది. ఈ సంఘటనపై మప్పేడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబ కలహాలతో
భర్త ఆత్మహత్య
తిరువొత్తియూరు: చైన్నె వడపళనిలో కుటుంబకలహాలతో భర్త ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చైన్నె, వడపలని వెస్ట్ శివాలయం వీధికి చెందిన ఆర్ముగం (47) కారు డ్రైవర్. ఇతనికి మద్యం అలవాటు ఉంది. రాత్రి సమయంలో మద్యం తాగి ఇంటికి వస్తుండడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈక్రమంలో శనివారం రాత్రి మద్యం మత్తులో ఆర్ముగం ఇంటికి వచ్చాడు. భార్య రాణితో గొడవ పడ్డాడు. విరక్తి చెందిన రాణి అతనిపై కోపగించుకొని ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తీవ్ర మనోవేదనకు గురైన ఆర్ముగం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతసేపటి తర్వాత బయటికి వెళ్లిన రాణి తిరిగి ఇంటికి వచ్చింది. ఆ సమయంలో భర్త శవముగా వేలాడుతుండడం చూసి దిగ్భ్రాంతి చెంది పోఈసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నాలుగు వాహనాలు ఢీ