
ఏవీఐటీలో నెట్రిక్స్ 2కే 25 ప్రాజెక్ట్ పోటీలు
సాక్షి, చైన్నె: ఆరుపడై వీడు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఏవీఐటీ) కంప్యూటర్ సైన్‌న్స్ ఇంజినీరింగ్ విభాగం నెట్రిక్స్ 2కే 25 పేర్లతో జాతీయస్థాయి ప్రాజెక్టు పోటీల సింపోజియం విజయవంతంగా జరిగింది. జాతీయ స్థాయి టెక్నాలజీ పోటీగా పయనూర్ క్యాంపస్‌లో జరిగిన కార్యక్రమానికి దేశంలోని వివిధ విద్యా సంస్థల నుంచి విద్యార్థులు తరలివచ్చారు. వారి ప్రతిభను ప్రదర్శించడానికి, జ్ఞానాన్ని మార్పిడి చేసుకోవడానికి ఈ కార్యక్రమం ఓ వేదికగా నిలిచింది ఏఐసీటీఈ విజన్ ఆఫ్ ఏఐ ఫర్ ఆల్ విధానం మేరకు విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించుకునేందుకు, అమలు చేయడానికి వీలు కల్పించారు. గ్లోబల్ టెక్నికల్ డైరెక్టర్ డాక్టర్ సాయినారాయణన్ గోపాలకృష్ణన్ ఈ కార్యక్రమంలో ఏఐ, విద్య, వైద్యం వినోదం, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, వివిధ రంగాలపై ప్రభావం గురించి వివరించారు. విద్యా సంస్థకు చెందిన కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ ఎస్ బాలకృష్ణన్ , ప్రిన్సిపల్ డాక్టర్ జి.సెల్వకుమార్, సీఎస్‌ఈ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ముత్తుకుమరన్, సమన్వయకర్త డాక్టర్ రాజేష్ పాల్గొన్నారు.