సాక్షి, చైన్నె: ఫెదర్స్ హోటల్‌లో గుంటూరు నుంచి గోదావరి వరకు నినాదంతో వంటకాల రుచులు కలిగిన ఫుడ్ ఫెస్టివల్ శుక్రవారం ఏర్పాటు కానుంది. ఆంధ్ర – తెలంగాణ రుచులను భోజన ప్రియులకు అందించేలా మెను సిద్ధం చేశారు. ఆంధ్ర, తెలంగాణ రుచులు, వివిధ వారసత్వ వంటకాలను ఇక్కడి ఆహార ప్రియులకు అందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. గుంటూరు ముచ్చటైన కారంతో ఉండే రుచులు, గోదావరి సుగంధ ద్రవ్యాలు, తీరప్రాంత రుచికరమైన వంటకాల వరకు, ఈ ఆహార ఉత్సవంలో కొలువు దీర్చనున్నారు. చట్నీలు, కూరలు, సువాసన గల బిర్యానీలు, సంప్రదాయ స్వీట్లు, ఆవకాయ పచ్చడి, గోంగూర మాంసం, మామిడికాయ పప్పు, గుంటూరు కోడి కూర, రొయ్యలు వేపుడు, నెల్లూరు చేప పులుసు, తెలగపిండి ఎండు రొయ్యలు, కోడి పులావ్, ఆవకాయ అన్నం అంటూ బ్రహ్మాండ బఫేగా వంటకాలను అందిస్తున్నారు. ఈనెల 23వ తేదీ వరకు ఫెడర్స్ వాటర్ సైడ్‌లో ఈ ఫుడ్ ఫెస్టివల్ సాగనున్నది.