● కోవై యువకుడి అరెస్టు
తిరువొత్తియూరు: ఆంధ్ర నుంచి ఎక్స్‌ప్రెస్ రైలు ద్వారా గంజాయిని తరలించిన కోవైకి చెందిన యువకుడిని పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుంచి 10 కిలోల గంజాను స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. చైన్నె సెంట్రల్ రైల్వే స్టేషన్లో గురువారం ఉదయం పోలీసులు నిఘా చేస్తున్నారు. ఈక్రమంలో 1వ ప్లాట్‌ఫారానికి షాలిమార్ ఎక్స్‌ప్రెస్ వారాంతపు ప్రత్యేక రైలు వచ్చి ఆగింది. రైల్వే పోలీస్ ఇన్‌స్పెక్టర్ గోవిందరాజ్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేశారు. ఆ సమయంలో ఓ యువకుడి వద్ద ఉన్న సంచిలో 10 కిలోల గంజాయి ఉన్నట్లు తెలిసింది విచారణలో అతను కోవై జిల్లా మాదం పట్టి మహాలక్ష్మి ఆలయ వీధికి చెందిన సురేష్ కుమార్ (26) అని ఆంధ్ర నుంచి అతను గంజాయి తీసుకొస్తున్నట్లు తెలిపాడు. అతని వద్ద నుంచి పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సురేష్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి పుళల్ జైలుకు తరలించారు.
క్యూఎస్ వరల్డ్ వర్సిటీ
ర్యాంకింగ్స్‌లో ‘వీఐటీ’కి చోటు
కొరుక్కుపేట: ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలను వివిధ అంశాల వారీగా అంచనా వేసే క్యూఎస్ ర్యాంకులు–2025 విడుదలయ్యాయి. ఈ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్– 2025లో ప్రతిష్టాత్మక విద్యాసంస్థ అయిన వేలూ రు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) స్థానం దక్కించుకుంది. 14 పాఠ్యాంశాల బోధనలో అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల సరసన వీఐటీ నిలవడం విశేషం. డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెనన్స్(ఏఐ) పాఠ్యాంశాలకు సంబంధించి.. ఏకంగా ప్రపంచంలోని టాప్–100 విశ్వవిద్యాలయాల జాబితాలో చోటు దక్కించుకుంది. అంతర్జాతీయ విద్యావిశ్లేషకుడు క్యాక్వారెల్లి సైమండ్స్ ఈ జాబితాను బుధవారం విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 1700 విశ్వవిద్యాలయాల్లో 55 రకాల పాఠ్యాంశాలపై సమగ్ర విశ్లేషణ చేపట్టి క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్–2025 ఎడిషన్‌ను రూపొందించారు. ఈ అధ్యయనంలో వీఐటీ అద్భుత ప్రతిభను ప్రదర్శించింది. 4 పాఠ్యాంశాల ర్యాంకులను మెరుగుపర్చుకోవడంతోపాటు మరో 8 పాఠ్యాంశాల ర్యాంకులను యథాతథంగా కాపాడుకోగలిగింది. మరో రెండు పాఠ్యాంశాలు తొలి సారి ర్యాంకింగ్ జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. ఈ సందర్భంగా వీఐటీ వర్సిటీ నిర్వహకులు హర్షం వ్యక్తం చేశారు.
వీఐటీలో బోధిస్తున్న పాఠ్యాంశాలకు దక్కిన పాయింట్లు
ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ 142, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ 110, డేటాసైనన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెనన్స్ 51– 100, ఇంజినీరింగ్ – ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 151–200, ఇంజినీరింగ్– మెకానికల్, ఏరోనాటికల్ అండ్ మానుఫ్యాక్చరింగ్ 201– 250, ఇంజినీరింగ్ – కెమికల్ 251 – 300, న్యాచురల్ సైన్సెస్ 362, మెటీరియల్ సైన్‌న్స్ 151–200, మ్యాథమెటిక్స్ 201–250, స్టాటిస్టిక్స్ అండ్ ఆపరేషనల్ రీసెర్చ్ 251–275, కెమిస్ట్రీ 301–350, ఫిజిక్స్ అండ్ అస్ట్రానమీ 401–450, ఎన్విరాన్‌మెంట్ సైన్సెస్ 451–500, బయోలాజికల్ సైన్సెస్ 351–400, అగ్రికల్చరర్ అండ్ ఫారెస్ట్రీ 351–400, బిజినెస్ అండ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ 551–600 పాయింట్లు దక్కించుకుంది.
అవినాశిలో దారుణం
● ఫాంహౌస్‌లో దంపతుల హత్య
సేలం: తిరుప్పూర్ జిల్లాలోని అవినాశి సమీపంలో రైతు దంపతుల హత్య దిగ్భ్రాంతికి గురిచేసింది. తిరుప్పూర్‌లోని అవినాశి సమీపంలోని తులుక్కముత్తూర్ పంచాయతీలోని ఊంజపాలయం గ్రామంలోని ఒక తోట ఇంట్లో పళనిస్వామి (84), అతని భార్య పర్వతం (70) అనే దంపతులు నివసిస్తున్నారు. వారి పిల్లలు వివాహం చేసుకుని విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ, ఈ దంపతులు తోట ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. ఈ క్రమంలో గురువారం చాలాసేపు ఆ జంట ఇంటి నుంచి బయటకు రాలేదు. అనుమానం వచ్చిన పొరుగింటి వారు చూడగా.. ఆ జంట దారుణంగా హత్యకు గురైనట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు వారి మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కోడి గొడవ కారణంగానే..
పోలీసుల ప్రాథమిక విచారణలో అదే ప్రాంతంలో నివసిస్తున్న రమేష్ (46) వివాహం కాలేదు. ఇతని కోడి పళనిస్వామి ఇంటికి వద్దకు చేరి అరుస్తూ ఉన్నట్టు, ఈ విషయంగా పళనిస్వా మి, పర్వతం దంపతులు రమేష్‌తో అప్పుడ ప్పుడూ గొడవపడుతూ వచ్చారని తెలిసింది. ఈ క్రమంలో బుధవారం కూడా వీరి మధ్య గొడవ ఏర్పడగా రమేష్ కత్తితో పళనిస్వామి, పర్వతంను హత్య చేసి, బైక్‌పై పరారైనట్లు తెలిసింది. ఈమేరకు పోలీసులు రమేష్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.