– విచారణ ఏప్రిల్ 9కి వాయిదా
తమిళసినిమా: కోలీవుడ్‌లో నటి నయనతారపై న టుడు ధనుష్ చైన్నె హైకోర్టులో వేసిన పిటిషన్ చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ కే సులో న్యాయస్థానం ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వివరాలు.. విజయ్ సేతుపతి నయనతార జంటగా నటించిన చిత్రం నానుమ్ రౌడీ దాన్. నటుడు ధనుష్ తన వండర్ బార్ ఫిలిమ్స్ పతాకంపై నిర్మించారు. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అంత వరకు అంతా హ్యాపీ. అయితే ఇటీవల నోటా నయనతార తన జీవితంలో జరిగిన ముఖ్య ఘటనలతో నయనతార బిహైండ్ ది ఫెయిరీ పేరుతో డాక్యుమెంటరీ చిత్రాన్ని రూ పొందించారు.దీన్ని నెట్ ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ నయనతార పుట్టినరోజు సందర్భంగా స్ట్రీమింగ్ చేసింది. అయితే అందులో తన అనుమతి లేకుండా తన చిత్రం నానుమ్ రౌడీదాన్‌లోని సన్నివేశాలను పొందుపరిచారని ఆరోపిస్తూ నటుడు ధనుష్ చైన్నె హైకోర్టులో రూ.10 కోట్లు నష్టపరిహారం కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే అంతకు ముందే ఈ వ్యవహారంలో నయనతార, నెట్ ఫ్లిక్స్ సంస్థకు ధనుష్ తరపున సమన్లు జారీ చేశారు. దీంతో నయనతార నటుడు ధనుష్‌ను విమర్శిస్తు బహిరంగంగా ప్రకటనను మీడియాకు విడుదల చేశారు. అంతే కాకుండా ధనుష్ నష్టపహారం వ్యవహారంపై కోర్టు లోనే ఎదుర్కొంటామని పేర్కొన్నారు. కాగా ఈ కేసు మరోసారి గురువారం న్యాయస్థానం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా నయనతార, ధనుష్ తరపు న్యాయవాదులు తీవ్రంగా తమ వాదనను వినిపించారు. నానుమ్ రౌడీ దాన్ చిత్రంలో ఉపయోగించని సన్నివేశాలునే డాక్యుమెంటరీ చి త్రంలో వాడామని, అందువల్ల నటుడు ధనుష్ కో రినట్లుగా నష్ట పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని వాదించారు. అయితే నానుమ్ రౌడీ దాన్ చి త్రంలో ఉపయోగించక పోయినా, అవి తమ చిత్రం కోసం చిత్రీకరించినవేనని ధనుష్ తరపు న్యాయ వాది వాదించారు. అంతే కాకుండా నానుమ్ రౌడీ దాన్ చిత్రం షూటింగ్‌లో నయనతారను ఎలివేట్ చేయడానికి దర్శకుడు విఘ్నే ష్ శివన్ పలు టేక్‌లు షూట్ చేసి చిత్ర నిర్మాణ వ్యయం పెంచొరని ఆరోపిస్తూ నయనతార డాక్యుమెంటరీపై నిషేధం విధించాలని కోరారు. అయితే నిషేధించాలన్న కోరికను న్యాయస్థానం నిరాకరిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా వేసింది.