అన్నానగర్: కాంచీపురం సమీపంలో మంగళవారం పెళ్లి నిశ్చితార్థానికి వధువును సైకిల్ పై ఊరేగింపుగా తీసుకొచ్చాడు వరుడు. నలుగురు సోదరులు పల్లకి పై తీసుకెళ్లారు. వివరాలు.. కాంచీపురం జిల్లా కలెక్టరేట్ సమీపంలోని అయ్యప్ప నగర్ ప్రాంతానికి చెందిన వడివేల్. కాంచీపురంలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో ఆయన కుమార్తె వివాహ వేడుక జరిగింది. రజినీ కాంత్ నటించిన అన్నామలై సినిమాలోని రెక్క కట్టి పరుకుదయ్య అన్నామలై సైకిల్ పాటలోని సీనన్‌లో కనిపించిన వరుడు మనోజ్ పెళ్లి మండపం సమీపంలోని శివాలయం నుంచి వధువు యోగలక్ష్మిని సైకిల్‌పై ఊరేగింపుగా తీసుకొచ్చాడు. రోడ్డుపై సైకిల్ తొక్కుతున్న వధూవరులను చూసి అటుగా వెళ్తున్న జనం ఆశ్చర్యపోయారు. కళ్యాణ మండపానికి చేరుకున్న యోగలక్ష్మిని నలుగురు సోదరులు వధూవరులకు స్వాగతం పలికారు. వీరు యోధుల వేషధారణలో యోగలక్ష్మి పల్లకిపై ఎక్కించుకుని నలుగురూ సినిమా పాటకు అనుగుణంగా నృత్యం చేశారు. నిశ్చితార్థ వేడుకలో కళా ప్రదర్శనలు కూడా జరిగాయి.