● పుదుచ్చేరి ఎల్జీ కై లాస్‌నాథన్
సాక్షి, చైన్నె: ప్రభుత్వంలోని వివిధ విభాగాలలోని ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని పుదుచ్చేరి అసెంబ్లీలో ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ కై లాష్ నాథన్ ప్రకటించారు. పుదుచ్చేరి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇక్కడ బడ్జెట్ సమావేశాలు లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసగంతో ప్రారంభించడం ఆనవాయితీ. ఆ దిశగా ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలలో తన తొలి ప్రసంగాన్ని అందించేందుకు అసెంబ్లీకి కై లాష్‌నాథన్ ఉదయం వచ్చారు. పుదుచ్చేరి ఎల్జీగా బాధ్యతలు స్వీకరించినానంతరం ఆయనకు ప్రసంగించే అవకాశాలు ఇప్పడే వచ్చింది. దీంతో సభకు వచ్చిన ఆయనకు స్పీకర్ ఎన్బళం సెల్వం,సీఎం రంగస్వామి, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఆహ్వానం పలికారు. ప్రతిపక్ష సభ్యులు సైతంగవర్నర్‌కు సాదర ఆహ్వానం పలికారు. సభలో గవర్నర్ తమిళంలో తన ప్రసంగాన్ని కొనసాగించారు. దేశంలోని కేంద్రపాలిత ప్రాంతాలలో పుదుచ్చేరి మాత్రమే అన్ని రకాలుగా సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు విజయవతంగా అందిస్తున్నదని వివరించారు. నాలుగు సంవత్సరాలలో 2,444 ఖాళీలను భర్తీ చేసారని, త్వరలో అన్నిఖాళీలను భర్తీ చేయడం జరుగుతుందని ప్రకటించారు. ఏడాది కాలంగా రంగస్వామి ప్రభుత్వం చేసిన ప్రగతి పనులు, పథకాలు, సంక్షేమకార్యక్రమాలను ప్రస్తావిస్తూ ఎల్జీ తనప్రసంగాన్ని ముగించారు. దీంతో సభను స్పీకర్ ఎన్బలం సెల్వం మంగళవారానికి వాయిదా వేశారు. మంగళవారం ఎల్జీ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై చర్చ జరగనుంది. బుధవారం అసెంబ్లీలో 2025–26 సంవత్సరానికి గాను ఆర్థిక బడ్జెట్‌ను సీఎం రంగస్వామి దాఖలు చేశారు.