ఉచిత ఐపీఎల్‌ టికెట్లు.. క్రికెట్‌ అభిమానుల్లో ఆనందం

- - Sakshi

తమిళనాడు: క్రికెట్‌ అభిమానుల కోసం చైన్నె సూపర్‌ లీగ్‌ తమ అధికారిక సోషల్‌మీడియా పేజీల్లో ఐపీఎల్‌ క్రికెట్‌ను ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని కల్పిస్తూ బహుమతి పోటీని నిర్వహించింది. పలువరు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. సరైన సమాధానాలు ఇచ్చిన వారికి 25 ఉచిత ఐపీఎల్‌ క్రికెట్‌ టికెట్లు అందజేశారు. మరో 100 కన్సొలేషన్‌ ప్రైజ్‌లను చేపాక్‌ సూపర్‌ లీగ్‌ టీమ్‌ అందజేసింది.

శనివారం రాత్రి జరిగిన చైన్నె సూపర్‌ కింగ్స్‌, ముంబయి ఇండియన్‌ మధ్య జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌ను ఉచిత టికెట్లు పొందిన క్రికెట్‌ అభిమానులు ప్రత్యక్షంగా తిలకించి ఆనందంతో ఉప్పొంగి పోయారు. ఈ సందర్భంగా క్రికెట్‌ అభిమాని భవేత్‌ రాజా మాట్లాడుతూ ధోనీని ప్రత్యక్షంగా చూసే అవకాశం దక్కిందని హర్షం వ్యక్తంచేశాడు. వర్షం కురిసినా టికెట్‌ కొనుగోలు చేసేందుకు వచ్చిన సేలంకు చెందిన రవీంద్రన్‌ మాట్లాడుతూ చైన్నె సూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌ చూసేందుకు వచ్చానని చెప్పాడు.

అలాగే చైన్నెకి చెందిన మిథున్‌ రాజ్‌ చేపాక్‌ స్టేడియంలో రాత్రంతా నిరీక్షించినా టికెట్టు దొరకలేదని, చేపాక్‌ సూపర్‌ లీగ్‌ నిర్వహించిన పోటీ ద్వారా ఉచిత టిక్కెట్‌ లభించిదని దీంతో మ్యాచ్‌ను లైవ్‌గా చూసే అదృష్టం కలిగిందని వివరించారు.

Read latest Tamil Nadu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top