
14న తిరుమలగిరికి సీఎం రాక: ఎమ్మెల్యే
తిరుమలగిరి : ఈనెల 14న సీఎం రేవంత్‌రెడ్డి తిరుమలగిరి మండలానికి రానున్నట్లు ఎమ్మెల్యే మందుల సామేలు తెలిపారు. తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని మాలిపురంలో సీఎం సభా స్థలాన్ని సోమవారం సామేలు పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తిరుమలగిరి మండల కేంద్రంలో సీఎం చేతుల మీదుగా రేషన్ కార్డులు అందజేయనున్నట్లు చెప్పారు. తిరుమలగిరిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనానికి శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా మార్చేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా అంగీకరిచినట్లు తెలిపారు. కార్యక్రమానికి మంత్రులంతా హాజరవుతారని తెలిపారు. సమావేశంలో సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవరావు, డీఎస్పీ ప్రసన్నకూమార్, తహసీల్దార్ హరిప్రసాద్, మండల పార్టీ అధ్యక్షుడు వై.నరేష్, జమ్మిలాల్, వీరేష్, లింగయ్య, గోవర్థన్ పాల్గొన్నారు.