
వానమ్మ.. ఒక్కసారి రావమ్మ
అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలం కొత్తగూడెం గ్రామంలో వానమ్మ.. వానమ్మ.. వానమ్మా ఒక్కసారైన వచ్చిపోవమ్మా అంటూ మహిళలు పాటలు పాడుతూ చుట్టు కాముడు ఆడుతూ వరుణదేవుడిని వేడుకున్నారు. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పత్తిచేలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వానదేవుడు కరుణించి వర్షాలు కురిపించి చెరువులు, కుంటలు నింపి పంటలు సమృద్ధిగా పండేలా చూడాలని చుట్టుకాముడు వేస్తూ పాటలు పాడారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన మహిళలు ఆకుల నాగమ్మ, ఆకుల లింగమ్మ, చల్లా మంగమ్మ, తాడూరి నర్సమ్మ, రామసాని రాధ తదితరులు పాల్గొన్నారు.