
డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తం
తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ప్రధానంగా మోత్కూరు–తొర్రూరు ప్రధాన రహదారిపై రెండేళ్లుగా రోడ్డు నిర్మాణ పనులు నత్త నడకన సాగుతుండటంతో ఇళ్లలోని మురుగు నీరంతా రహదారిపై చేరి దుర్గంధం వెదజల్లుతోంది. శివారు ప్రాంతాల్లో వారం రోజులకు ఒకసారి కూడా మురుగు కాల్వలు శుభ్రం చేయడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. కొన్నిచోట్ల డ్రెయినేజీలు లేక ఖాళీ స్థలాల్లో మురుగు నీరు చేరి దోమలు, పందులకు ఆవాస కేంద్రాలుగా మారాయి. వర్షా కాలం ప్రారంభమైనా బ్లీచింగ్ చల్లడంలేదని, ఫాగింగ్ సరిగా చేయడం లేదని ప్రజలు చెబుతున్నారు.