
చెత్త సేకరణలో జాప్యం
సూర్యాపేట అర్బన్ : సూర్యాపేట పట్టణంలో చెత్తను సేకరించడానికి మున్సిపాలిటీ సిబ్బంది పనిచేస్తున్నా, అధికారుల పూర్తిస్థాయి పర్యవేక్షణ లేక ప్రజలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు విజృంభించే ఈ తరుణంలో సూర్యాపేట మున్సిపాలిటీలో 100 రోజుల ప్రణాళికలో భాగంగా నిత్యం చెత్త సేకరణ చేస్తున్నారు. కానీ శివారు ప్రాంతాలు, చిన్నచిన్న గల్లీలలో చెత్త సేకరణలో జాప్యం జరిగుతోంది. దీంతో ఇళ్లలో చెత్త పేరుకుపోతోందని ప్రజలు అంటున్నారు. శివారు ప్రాంతాల్లో చెత్తను రోడ్ల పక్కన ఖాళీ ప్లాట్‌లలోనే వేస్తున్నారు. ఈ క్రమంగా దోమలు, ఈగలు వ్యాప్తి చెంది అనారోగ్యం బారిన పడుతున్నామని శివారు కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడి, పొడి చెత్త వేరు చేయకుండా సేకరిస్తున్నారని చెబుతున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారుల్లో చెత్తను పూర్తిస్థాయిలో సేకరించి శుభ్రంగా ఉంచుతున్నారు.