
ప్రజా ప్రభుత్వం.. సంక్షేమమే ధ్యేయం
పథకాల అమలు తీరును అధికారులు పర్యవేక్షించాలి
ఫ జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
ఫ ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై నల్లగొండ కలెక్టరేట్‌లో సమీక్ష
ఫ హాజరైన మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
ఫ ఆయా రంగాల్లో ప్రగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన కలెక్టర్లు
నల్లగొండ : అధికారులు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను పర్యవేక్షించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధిపై బుధవారం నల్లగొండ కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలతో కలిసి సమీక్ష నమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ తమది ప్రజా ప్రభుత్వమని ప్రజల కోసం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకాన్ని క్షేత్రస్థాయిలో అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం ద్వారా అర్హులకు మేలు జరుగుతుందన్నారు. జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారుల సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. రైతులకు సంబంధించిన అంశాలను మండలస్థాయి అధికారులతో జిల్లా అధికారులు రోజూ పర్యవేక్షించాలన్నారు. రైతు భరోసా, బీమా, ఎరువులు, విత్తనాల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించి సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా అభివృద్ధికి 15 రోజులకోసారి సమావేశం ఏర్పాటుచేస్తామన్నారు. సమావేశంలో ఎంపీలు కిరణ్‌కుమార్‌రెడ్డి, కుందూరు రఘువీర్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ చైర్మన్ అమిత్‌రెడ్డి, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, యాదాద్రి జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, నల్లగొండ ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్ పాల్గొన్నారు.