
100 అడుగుల జెండా ఏర్పాటు అభినందనీయం
కోదాడరూరల్ : కోదాడ పట్టణంలో 100 అడుగుల జాతీయ జెండా ఏర్పాటు చేయడం అభినందనీయమని ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్(ఐవీఓ) జాతీయ అధ్యక్షుడు జే.ఎస్. సెంగార్ అన్నారు. కోదాడలో ఐవీఓ ఆధ్వర్యంలో 100 అడుగుల జాతీయ జెండా ఏర్పాటు చేసి ఏడాది పూర్తి అయిన సందర్భంగా బుధవారం నిర్వహించిన వార్షికోత్సవంలో ఐవీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఉజ్జిని రవీందర్, జిలా అధ్యక్షుడు గుండా మధుసూదన్‌రావులతో కలిసి సెంగార్ పాల్గొని మాట్లాడారు. మాజీ సైనికులు కలిసి ఏర్పాటు చేసిన జాతీయ జెండా రాష్ట్రంలో కోదాడదే ప్రథమం అని తెలిపారు. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకు జాతీయ జెండా ఏర్పాటుకు ముందుకు వచ్చిన కోదాడవాసుల ఆర్థిక సహాయం ఎంతోగొప్పదని కొనియాడారు. అంతకుముందు కార్గిల్ యుద్ధవీరుడు గోపయ్య వర్ధంతి సందర్భంగా కోదాడ పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్‌సీసీ విద్యార్థినుల కవాతు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఐవీఓ వైస్ ప్రెసిడెంట్ రామారావు, జనరల్ సెక్రటరీ ఉపేందర్, ట్రెజరర్ వెంకన్న , మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ సామినేని ప్రమీల, ప్రవళిక, నాగేశ్వరరావు, ఎంఈఓ సలీం షరీఫ్ పాల్గొన్నారు.

100 అడుగుల జెండా ఏర్పాటు అభినందనీయం