
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
తిరుమలగిరి (తుంగతుర్తి) : విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని అదనపు కలెక్టర్ రాంబాబు సూచించారు. శుక్రవారం తిరుమలగిరి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం, స్టాక్ వివరాలు, రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ హరిప్రసాద్, ప్రిన్సిపాల్ సునీత ఉన్నారు.
సీఎం సభా స్థలి పరిశీలన
తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరిలో ఈ నెల 14న నూతన రేషన్ కార్డుల పంపిణీని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సభా స్థలిని సివిల్ సప్లయ్ డైరెక్టర్ ముజామిల్‌ఖాన్ శుక్రవారం పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ.. సభా స్థలిలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ రాంబాబు, ఆర్డీఓ వేణుమాధవరావు, తహసీల్దార్ హరిప్రసాద్, స్థానిక నాయకులు ఉన్నారు.
పీహెచ్‌సీల తనిఖీ
మునగాల: మండల కేంద్రంలోని పీహెచ్‌సీతో పాటు రేపాలలో ఉన్న పీహెచ్‌సీని శుక్రవారం ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌ఓ చంద్రశేఖర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా కేంద్రాల్లో రికార్డులను పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వ్యాధి నిరోధక టీకాలను ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. విధుల పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. త్వరలో చేపట్టబోయే వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా పీహెచ్‌సీల ఆవరణలో విరివిగా మొక్కలు నాటేందుకు గుంతలు తీయించి సిద్ధంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీఓ రమేష్‌దీనదయాళ్, మునగాల, రేపాల పీహెచ్‌సీ వైద్యాధికారులు డాక్టర్ రవీందర్, డాక్టర్ వినయ్‌కుమార్, సిబ్బంది ఉన్నారు.
మొక్కలు నాటి సంరక్షించాలి
కోదాడరూరల్ : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని జిల్లా పశువైద్యాధికారి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని ఏరియా పశువైద్యశాలను సందర్శించి మొక్కలు నాటి మాట్లాడారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఏరియా వైద్యశాలలో పిచ్చిమొక్కలను తొలగించి మొక్కలు నాటారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ పెంటయ్య, సిబ్బంది అఖిల్, చంద్రకళ, కర్ణ ఉన్నారు.

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి