
బాధితుల ఫిర్యాదులపై వేగంగా స్పందించాలి
చిలుకూరు : పోలీస్ స్టేషన్‌లో బాధితుల ఫిర్యాదుపై వేగంగా స్పందించాలని జిల్లా ఎస్పీ కె.నరసింహ ఆదేశించారు. బుధవారం చిలుకూరు పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. నమోదవుతున్న కేసుల స్థితిగతులు, ఫిర్యాదుల తీరుతెన్నులను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు.. ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. రహదారి భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణపై కూడా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎస్పీ వెంట ఎస్‌ఐ రాంబాబు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
ఫ ఎస్పీ నరసింహ