ఎంజీయూ డిగ్రీ పరీక్షల ఫలితాలు విడుదల | - | Sakshi
Sakshi News home page

ఎంజీయూ డిగ్రీ పరీక్షల ఫలితాలు విడుదల

Jul 3 2025 4:36 AM | Updated on Jul 3 2025 4:36 AM

ఎంజీయ

ఎంజీయూ డిగ్రీ పరీక్షల ఫలితాలు విడుదల

నల్లగొండ టూటౌన్‌ : నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ పరీక్షల ఫలితాలను వీసీ ఖాజాఅల్తాఫ్‌ హుస్సేన్‌ బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఈఓ డాక్టర్‌ ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ డిగ్రీ మొదటి సెమిస్టర్‌లో 21.76 శాతం, రెండవ సెమిస్టర్‌ 23.56 శాతం, మూడో సెమిస్టర్‌లో 31.08 శాతం, నాలుగో సెమిస్టర్‌లో 36.05 శాతం, ఐదవ సెమిస్టర్‌లో 37.03 శాతం, ఆరవ సెమిస్టర్‌లో 46.07 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఫలితాల పూర్తి వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజి స్ట్రార్‌ అల్వాల రవి, కోఆర్డినేటర్లు లక్ష్మీప్రభ, ప్రవళిక, భిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్య తెలంగాణే లక్ష్యం

అనంతగిరి: ఆరోగ్య తెలంగాణే లక్ష్యమని ఆయుష్‌ రీజినల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ రవి నాయక్‌ అన్నారు. అనంతగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయుష్‌ కేంద్రానికి అనుసంధానంగా నిర్మించిన యోగా సెంటర్‌ను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. సూర్యాపేట జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో 12 ఆయుష్‌ యోగా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రాగా ప్రస్తుతం 11 యోగా కేంద్రాలను నిర్మించినట్లు వివరించారు. ఒక్కో యోగా కేంద్రానికి రూ.6లక్షల నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కోఆర్డినేటర్‌ డాక్టర్‌ రామకృష్ణ, అనంతగిరి మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌, యోగా శిక్షకులు వినయ్‌, ఎమ్మార్పీఎస్‌ నాయకులు బొడ్డు కుటుంబరావు పాల్గొన్నారు.

ప్రభుత్వ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య

తిరుమలగిరి : ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి భానునాయక్‌ పేర్కొన్నారు. బుధవారం తిరుమలగిరిలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి మాట్లాడారు. అడ్మిషన్లు పెంచడానికి అధ్యాపకులు కృషి చేయాలని కోరారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ రాజమోహన్‌, బాల్తా శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

హాస్టల్‌ విద్యార్థుల రక్షణ మన బాధ్యత

సూర్యాపేటటౌన్‌ : హాస్టల్‌ విద్యార్థుల రక్షణ మన బాధ్యత అని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నిద్ర సంపత్‌ నాయుడు పేర్కొన్నారు. జిల్లాకు కేటాంచిన నూతన హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్లను బుధవారం సూర్యాపేట పట్టణంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్లు హాస్టల్‌ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు.

ఉపాధ్యాయుడి సస్పెన్షన్‌

కోదాడరూరల్‌: విధులకు ఎగనామం పెట్టిన కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిపై డీఈఓ సస్పెన్షవేటు వేసినట్లు ఎంఈఓ సలీం షరీఫ్‌ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఉపాధ్యాయుడు పోటు రవి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా గత నెల 21 నుంచి విధులకు హాజరు కావడం లేదనే విషయం పాఠశాల తనిఖీకి వెళ్లినప్పుడు తెలిసిందని తెలిపారు. దీనిపై డీఈఓకు లిఖితపూర్వకంగా నివేదిక అందజేయడంతో విచారణ చేపట్టిన ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

ఎంజీయూ డిగ్రీ పరీక్షల ఫలితాలు విడుదల1
1/2

ఎంజీయూ డిగ్రీ పరీక్షల ఫలితాలు విడుదల

ఎంజీయూ డిగ్రీ పరీక్షల ఫలితాలు విడుదల2
2/2

ఎంజీయూ డిగ్రీ పరీక్షల ఫలితాలు విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement