
ఇబ్బందులు కలగకుండా సీఎం సభ ఏర్పాట్లు చేయాలి
తిరుమలగిరి (తుంగతుర్తి) : ఈనెల 14 రేషన్‌కార్డుల పంపిణీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తిరుమలగిరి మండల కేంద్రానికి రానున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సభా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. మంగళవారం తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని మాలిపురం శివారులోని స్థలంతో పాటు ఈదులపర్రె తండా సమీపంలోని స్థలాన్ని, తహసీల్దార్ కార్యాలయం పక్కనే ఉన్న స్థలాన్ని ఎస్పీ నరసింహతో కలిసి కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ రాంబాబు, డీఆర్‌డీఓ అప్పారావు, ఆర్డీఓ వేణుమాధవరావు, డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ నాగేశ్వరరావు, తహసీల్దార్ హరిప్రసాద్, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.