
ఉపాధ్యాయుల కృషి అభినందనీయం
భానుపురి (సూర్యాపేట) : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ఉపాధ్యాయులు చేసిన కృషి అభినందనీయమని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమలగిరి జెడ్పీహెచ్‌ఎస్‌లో 190 మంది, కోదాడ బాలికల జెడ్పీహెచ్‌ఎస్‌లో 170 మంది, కోదాడ బాలుర జెడ్పీహెచ్‌ఎస్ 166 మంది చేరారని వివరించారు. జిల్లా వ్యాప్తంగా 1 వ తరగతిలో 2,857 మంది కొత్తగా చేరారని, అన్ని పాఠశాలల్లో 9,582 మంది కొత్తగా చేరారని, ఇది త్వరలో 10,000కు చేరుకోవాలని ఆకాక్షించారు. మూతబడిన 11 పాఠశాలలు రీ ఓపెన్ చేసినట్లు తెలిపారు.సమావేశంలో డీఈఓ అశోక్, కో ఆర్డినేటర్లు జనార్దన్, శ్రవణ్ కుమార్, రాంబాబు, పూలమ్మ, ఎంఈఓలు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, అధికారులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్