
మోదీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీలేదు
గరిడేపల్లి: ప్రధాని మోదీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. మంగళవారం గరిడేపల్లి మండల కేంద్రంలో చింతలపాలెం, మేళ్లచెరువు, గరిడేపల్లి, హుజూర్ నగర్ మండలాల సీపీఎం నాయకులు, కార్యకర్తలకు ఒక రోజు రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతోందని ధ్వజమెత్తారు. ఈకార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నగరపు పాండు, ములకలపల్లి రాములు, జిల్లా కమిటీ సభ్యులు పల్లె వెంకట్‌రెడ్డి, ఎస్‌కె యాకూబ్, బ్రహ్మం, సైదులు, మండల కమిటీ సభ్యులు తుమ్మల సైదయ్య, యానాల సోమయ్య, బోయిళ్ల అర్జున్ దోసపాటి భిక్షం, శ్రీనివాస్, వీరరాఘవులు, నందిపాటి మట్టయ్య, సుధాకర్, మండవ సైదులు, వెంకటేశ్వర్లు, శ్రీను, రామస్వామి, వెంకయ్య, వీరస్వామి పాల్గొన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి