
భూ భారతితో భూ సమస్యల పరిష్కారం
కోదాడరూరల్ : భూ భారతి చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ పేర్కొన్నారు. సోమవారం కోదాడ పట్టణంలో భూ భారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ధరణిలో పరిష్కరించలేని సమస్యలు ఉన్నాయని, ప్రతి సమస్యను కలెక్టర్ లేదా కోర్టు ద్వారా పరిష్కరించే విధంగా ఉండేదని అన్నారు. ఇప్పుడు భూ భారతి చట్టంతో అధికార వికేంద్రీకరణ జరుగుతుందని తద్వారా సమస్యను బట్టి తహసీల్దార్, ఆర్డీఓ, కల్టెకర్ స్థాయిలో పరిష్కారం కానునున్నట్లు తెలిపారు. 2014కు ముందు సాదా కాగితం, బాండ్ పేపర్‌పై భూమిని కొనుగోలు చేసి 12 సంవత్సరాలుగా సాగుచేస్తున్నవారు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి పట్టాదారు పాస్‌పుస్తకంలో అప్డేట్ చేస్తామన్నారు. ప్రతి ఏడాది డిసెంబర్31న అన్నిగ్రామాల్లో సభలు నిర్వహించి రైతులందరికీ 1బీ అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంఽథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, ఆర్డీఓ సూర్యనారాయణ, తహసీల్దార్ వాజిద్‌అలీ, ఎంపీడీఓ రాంచందర్‌రావు, మున్సిపల్ కమిషనర్ రమాదేవి, ఏఓ రజిని, ఎంపీఓ పాండురంగన్న, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ సామినేని ప్రమీల పాల్గొన్నారు.
30 వరకు విచారణ పూర్తి చేయాలి
భానుపురి (సూర్యాపేట) : ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల విచారణ ఈనెల 30 వరకు పూర్తి చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్ నుంచి నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ సెక్రటరీలు, మున్సిపల్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 14,000 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, ఇందిరమ్మ ఇళ్ల కమిటీల ద్వారా లబ్ధిదారులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. వీటి పర్యవేక్షణకు కోదాడకు డీఎఫ్‌ఓ సతీష్ కుమార్, హుజూర్‌నగర్‌కు డీటీడీఓ శంకర్, సూర్యాపేటకు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్‌నాయక్, తుంగతుర్తికి డీపీఓ యాదగిరిని స్పెషల్ ఆఫీసర్లుగా నియమించామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. రాంబాబు, డీఎఫ్ ఓ సతీష్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్ నాయక్, డీపీఓ యాదగిరి, హౌసింగ్ పీడీ ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్