
మట్టపల్లిలో అధ్యయనోత్సవాలు ప్రారంభం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ప్రారంభ (తొలక్కం) ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం మహా నివేదనతో భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఆదివారం అధ్యయనోత్సవం, సోమవారం పరమపదోత్సవం, మంగళవారం శాత్తుమరై పూజలు జరుగుతాయని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, బదరీనారాయణాచార్యులు, బ్రహ్మాచార్యులు, ఆంజనేయాచార్యులు, అనంతాచార్యులు, నర్సింహాచార్యులు పాల్గొన్నారు.