
కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభిస్తున్న జడ్జి శ్యాంకుమార్
హుజూర్‌నగర్: ప్రతి ఒక్కరూ కళ్లను కాపాడుకోవాలని, దీనికోసం పరీక్షలు చేయించుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి జిట్టా శ్యాం కుమార్, జూనియర్ సివిల్ జడ్జి సాంకేతిమిత్రలు సూచించారు. మంగళవారం హుజూర్‌నగర్ పట్టణంలోని కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. కంటి చూపు లేకపోతే సృష్టి మొత్తం అంధకారం అవుతుందన్నారు. అనంతరం కోర్టు ఆవరణలో ఏర్పాటుచేసిన నూతన వాటర్ ప్లాంట్‌ను వారు ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాముల రాంరెడ్డి, అధికార ప్రతినిధి కాల్వ శ్రీనివాసరావు, అడిషనల్ పీపీ శ్రీనివాస్, ఏజీపీ గోపాలకష్ణమూర్తి, న్యాయవాదులు ఎన్‌ఎస్‌ఆర్, ఎ. శ్రీనివాసరెడ్డి, ఎన్. సత్యనారాయణ, రవికుమార్, జక్కుల వీరయ్య, యాదగిరి, నాగార్జున, సురేష్, నారాయణరెడ్డి, రామలక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ సీనియర్ సివిల్ జడ్జి శ్యాం కుమార్