
కారుణ్య నియామక పత్రాలు అందజేస్తున్న జెడ్పీ చైర్ పర్సన్ గుజ్జ దీపిక
నడిగూడెం : మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలను మంగళవారం డీఐఈఓ జానపాటి కృష్ణయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆయన వెంట జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు మన్నెం సోమయ్య, లక్ష్మయ్య, జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ రాజయ్య ఉన్నారు.
ఆరుగురికికారుణ్య నియామకాలు
సూర్యాపేటటౌన్ : జిల్లా పరిషత్ కార్యాలయంలో మంగళవారం కారుణ్య నియామకాలు చేపట్టారు. ఆరుగురిని ఆఫీస్ సబార్డినేట్‌లుగా నియమించారు. ఈ మేరకు జెడ్పీ చైర్ పర్సన్ గుజ్జ దీపిక వారికి నియామకపు ఉత్తర్వులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ సురేష్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సోమేష్, జిల్లా అధ్యక్షుడు నాగయ్య, కోశాధికారి లింగయ్య పాల్గొన్నారు.
అడవుల పరిరక్షణ
అందరి బాధ్యత
కోదాడరూరల్ : అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జిల్లా ఫారెస్ట్ అఽధికారి ముకుందరెడ్డి అన్నారు. మంగళవారం కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండలో గల తేజవిద్యాలయ పాఠశాలలో పర్యావరణం పరిరక్షణ–మానవాళిబాధ్యత అనే అంశంపై విద్యార్థులతో నిర్వహించిన ముఖా ముఖి సమావేశంలో ఆయన మాట్లాడారు. అడవులు, వన్యప్రాణులను కాపాడాలన్నారు. ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. అడవుల శాతం తగ్గితే మానవ మనుగడకే ముప్పు కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రమాదేవి, సోమిరెడ్డి ఉన్నారు.
స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలి
పాలకవీడు: అధికారులు ప్రజాప్రతినిధులు నమన్వయంతో పనిచేసి స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలని డీపీఓ యాదయ్య పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన స్వచ్ఛ భారత్ మిషన్ ఫేస్–2 విధివిధానాలపై సర్పంచ్‌లు, కార్యదర్శులు, వీఓఏలు, క్షేత్ర సహాయకులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తడిచెత్త పొడి చెత్త సేకరించే విధానం, బహిరంగ మలమూత్ర విసర్జన ర హిత గ్రామాలుగా తీర్చిదిద్దడం, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్యం, మురుగునీటి వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలను ప్రణాళికాబద్ధంగా నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటాచారి, ఎంపీఓ దయాకర్, ఎంఓటి ట్రైనర్లు నరేందర్‌రెడ్డి సర్పంచ్‌లు, కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు.

విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న డీఎఫ్‌ఓ ముకుందరెడ్డి