సూర్యాపేటక్రైం : సాంకేతికతను సద్వినియోగం చేసుకుని కేసుల దర్యాప్తును వేగవంతం చేస్తున్నామని ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు. డీజీపీ పోలీస్ అధికారులతో హైదరాబాద్‌నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాలోని పోలీస్ కార్యాలయంలో ఎస్పీ పాల్గొన్నారు. పోలీస్‌శాఖ పనితీరును వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఎస్పీలు నాగభూషణం, వెంకటేశ్వర రెడ్డి, డీసీఆర్‌బీ డీఎస్పీ రవి, ఏఓ సురేష్ బాబు, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ నర్సింహ, సర్కిల్ సీఐలు సోమ్ నారాయణ్ సింగ్, రాజేష్, నాగార్జున, రామలింగారెడ్డి, ఆంజనేయులు, శివ శంకర్, రాజశేఖర్, గౌరీ నాయుడు, ఆర్‌ఐ శ్రీనివాసరావు, శ్రీనివాస్, నర్సింహారావు పాల్గొన్నారు.