కోదాడరూరల్: మహిళను లైంగికంగా వేధిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు కోదాడ రూరల్ ఎస్‌ఐ సాయిప్రశాంత్ తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ మండల పరిధిలోని రెడ్లకుంట గ్రామానికి చెందిన మహిళను అదే గ్రామానికి చెందిన చిరంజీవి లైంగికంగా వేధిస్తుండటంతో సోమవారం అర్థరాత్రి ఆమె పురుగు మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. సదరు మహిళ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిరంజీవిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ మహిళ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.