
బోల్తాపడిన లారీ
మిర్యాలగూడ అర్బన్: చెత్త కుప్పకు నిప్పుపెట్టడంతో పక్కనే నిలిపి ఉంచిన అంబులెన్స్ స్వల్పంగా దగ్ధమైన సంఘటన మిర్యాలగూడ పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు.. మిర్యాలగూడ పట్టణంలోని ఎన్‌ఎస్‌పీ క్యాంపు మినీ రవీంద్రభారతి ఎదురుగా చెత్తకుప్పలకు గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం సాయంత్రం నిప్పుపెట్టగా పక్కనే నిలిపి ఉంచిన అంబులెన్స్ టైర్లు, వెనక భాగం కాలిపోయింది. స్థానికులు గుర్తించి అగ్నిమాపక అధికారులకు సమాచారం అందిచటంతో వారు వచ్చి మంటలు ఆర్పివేశారు. దీంతో పక్కన మరిన్ని అంబులెన్స్‌లకు పెను ప్రమాదం తప్పింది.
అదుపుతప్పి లారీ బోల్తా
మద్దిరాల: కట్టెల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడిన సంఘటన మండల పరిధిలోని పోలుమల్ల శివారులో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ నుంచి వరంగల్ వైపునకు కట్టెల లోడుతో వెళ్తున్న లారీ పోలుమల్ల శివారుకి చేరుకోగానే అదుపుతప్పి 365వ నంబర్ జాతీయ రహదారి పక్కకు దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడినట్లు స్థానికులు తెలిపారు.