
సూర్యాపేట : దీక్షలో మాట్లాడుతున్న రమేష్‌రెడ్డి
భానుపురి(సూర్యాపేట): రాహుల్‌గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడం అప్రజాస్వామిక చర్య అని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్‌రెడ్డి అన్నారు. రాహుల్‌గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని ఖండిస్తూ సోమవారం జిల్లాకేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్‌లో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్‌గాంధీ భారత్ జూడోయాత్ర ద్వారా దేశంలో కాంగ్రెస్ పార్టీకి, రాహుల్‌గాంధీకి వస్తున్న ఆదరణకు చూసి కేంద్ర ప్రభుత్వం ఓర్వలేక పోతోందన్నారు. జాతి సంపదను అదానీకి దోచిపెడుతున్న విషయాన్ని రాహుల్‌గాంధీ పార్లమెంట్‌లో ప్రస్తావించి, విచారణకు పార్లమెంటరీ కమిటీని నియమించాలని డిమాండ్ చేయడంతోనే ఆయనపై కక్షకట్టి పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేశారన్నారు. ఈ దీక్షలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గట్టు శ్రీనివాస్, వెలుగు వెంకన్న, ముదిరెడ్డి రమణారెడ్డి, షఫీఉల్లా, గోదల రంగారెడ్డి, నామా ప్రవీణ్, ఫరూక్, స్వామినాయుడు, బంటు చొక్కయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రాహుల్‌ను ఎదుర్కొలేకే అనర్హత వేటు
పెన్‌పహాడ్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీని ఎదుర్కొలేకే ఆయన పార్లమెంట్ సభ్యత్వంపై బీజేపీ ప్రభుత్వం అనర్హత వేటు వేసినట్లు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని చెట్లముకుందాపురం, చిన సీతారాంతండా, పెద సీతారాంతండా గ్రామల్లో హాథ్ సే హాథ్ జోడో అభియాన్ పాదయాత్రలో పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో బచ్చుపల్లి నాగేశ్వర్‌రావు, కుందూరు వెంకట్‌రెడ్డి, యాట ఉపేందర్, ఎడ్ల వెంకట్‌రెడ్డి, నామా ప్రవీణ్, వల్దాస్ దేవేందర్, సర్పంచ్ శోభారాణి, వాసా వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ లక్ష్మయ్య, బాణోతు శంకర్, రమేష్, లఘుపతి పాల్గొన్నారు.