
విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేస్తున్న అన్నెపర్తి జ్ఞానసుందర్
తుంగతుర్తి: మండల కేంద్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలతో పాటు, మేరిమథర్, విద్యాభారతి పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న 285 మంది విద్యార్థులకు సోమవారం కాంగ్రెస్‌పార్టీ జిల్లా నాయకుడు అన్నెపర్తి జ్ఞానసుందర్ పరీక్ష సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జ్ఞానసుందర్‌ను ఉపాధ్యాయులు అభినందించారు. కార్యక్రమంలో కొండ నాగరాజు, ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సామగ్రిని సద్వినియోగం చేసుకోవాలి
విద్యార్థులు పరీక్ష సామగ్రిని సద్వినియోగం చేసుకోవాలని తుంగతుర్తి గ్రంథాలయ చైర్మన్ గోపగని రమేష్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష సామగ్రిని పంపిణీ చేసి మాట్లాడారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, తాటికొండ సీతయ్య, గుండగాని రాములు, కటకం వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ చెరుకు సృజన, హెచ్‌ఎం కొండగడ్పుల యాకయ్య, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.