శ్రీకాకుళం పాతబస్టాండ్ : ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ప్రతి అర్జీని అధికారులు అత్యంత బాధ్యతగా స్వీకరించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌లో జిల్లా అధికారులతో కలిసి 154 వినతిపత్రాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఎస్డీసీలు జయదేవి, పద్మావతి, జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
● ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం అందజేసే యూనిఫారాలను గతంలో మాదిరిగా కుట్టు ఏజెన్సీలు, మహిళా ఏజెన్సీలకు అందజేయాలని గాయిత్రీ మహిళా సొసైటీ ప్రతినిధులు కోరారు.
● సోంపేట మండలం జింకిభద్ర, బెంకిలి, పలాసపురం గ్రామాల్లో వడగండ్ల వాన ధాటికి టమాట, నువ్వు, కట్టెజనుము, చోడి, మిరప, మామిడి తదితర పంటలు పాడయ్యాయని, ప్రభుత్వం ఆదుకోవాలని ఎంజేఆర్ పూలే రాష్ట్ర బీసీ సంక్షేమ ప్రతినిధులు కోరారు. కార్యక్రమంలో ఎంజేఆర్ పూలే రాష్ట్ర బీసీ సంక్షేమ ప్రతినిధులు బీన ఢిల్లీరావు, కె.గోపీనాథ్, టి.బిహాస్, బాపూజీ, తామాడ అప్పలస్వామి తదితరులు కోరారు.


