నందిగాం: లట్టిగాం సమీపంలో జాతీయ రఽహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నందిగాం మండలం కాపుతెంబూరుకు చెందిన కోమటూరు ప్రసాదరావు(44) దుర్మరణం చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రసాదరావు భార్యాపిల్లలతో కలిసి లట్టిగాంలో నివాసముంటూ స్థానిక ప్రైవేటు పాఠశాల బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం పలాస వెళ్లేందుకు జాతీయ రహదారిపై బస్సు కోసం వేచి ఉండగా.. లఖిదాసుపురంకు చెందిన తెలిసిన వ్యక్తి తన బొలెరా వాహనం ఆపాడు. ఆ వాహనం వద్దకు వెళ్తుండగా టెక్కలి నుంచి పలాస వైపు వెళ్తున్న వ్యాను ప్రసాదరావును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రసాదరావు రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. గమినించిన స్థానికులు వెంటనే టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రసాదరావుకు భార్య శాంతికుమారి, కుమారుడు నిరంజన్, కుమార్తె కావ్యశ్రీ ఉన్నారు. శాంతికుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిగాం ఎస్‌ఐ షేక్ మహమ్మద్ ఆలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


