వీఆర్ గూడెం ఎర్ర కొండలో అక్రమ తవ్వకాలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :
ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలంలో కొండలు తరిగిపోతున్నాయి. అక్రమంగా కొండల్ని తవ్వేసి గ్రావెల్ దోపిడీ చేస్తున్నా రు. ప్రకృతి వనరులు విధ్వంసం చేసి, అడ్డంగా సంపాదిస్తున్నారు. కీలక నేత కనుసన్నల్లో పచ్చనేతలు సొమ్ము చేసుకుంటున్నారు. అక్కడక్కడ క్రషర్లకు ఉన్న అనుమతులు చూపించి, ఏకంగా క్వారీలు నడుపుతున్నారు. రైల్వే లైన్లు, లేఅవుట్లకు, అపార్ట్‌మెంట్, ఇళ్ల పునాదుల ఫిల్లింగ్‌కు విక్రయించి అక్రమంగా రూ.కోట్లు సంపాదిస్తున్నారు. నిర్మానుష్యమైన కొండ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మై నింగ్ సామ్రాజ్యంలో ఏ ఒక్కరూ అడుగు పెట్టలేక పోతున్నారు. అధికారులు సైతం అక్కడికెళ్లడానికి భయపడుతున్నారు. ఇక్కడ జరుగుతున్న అక్రమ తవ్వకాలను నియంత్రించాలంటే చెక్ పోస్టు పెట్టాలని మండల స్థాయి అధికారులు జిల్లా ఉన్నతాధికారులకు నివేదించారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
దర్జాగా దోపిడీ..
పొందూరు మండలంలో అధిక సంఖ్యలో కొండలు ఉన్నాయి. నల్ల రాయి, ఎర్ర రాయి, ఎర్ర గ్రావెల్ అధికంగా దొరుకుతుంది. ఈ మండలంలో రాపాకలోని సర్వే నంబర్ 335లో, కృష్ణాపురంలోని సర్వే నంబర్ 198లో మాత్రమే నల్ల రాళ్లను కొట్టుకోవడానికి అనుమతి ఉంది. అలాగే, వీఆర్ గూడెంలో క్రషర్‌కు అనుమతి ఉంది. మిగతా చోట్ల ఎక్కడా అనుమతుల్లేవు. కానీ రాపాకలో అనుమతి ఉన్న ప్రాంతంలోనే కాకుండా పక్కనున్న ఏరియాలో అక్రమంగా తవ్వేస్తున్నారు. కృష్ణాపురంలో కూడా అదే జరుగుతోంది. వీఆర్ గూడెంలోని సర్వే నంబర్ 137లోని ఎర్రకొండనైతే ఏకంగా గుల్ల చేసేస్తున్నా రు. వీటితో పాటు మరికొన్ని గ్రామాల్లోని కొండల్లో కూడా అక్రమ క్వారీ జరుగుతోంది. రైల్వే లైన్ కో సం, అపార్ట్‌మెంట్లు, ఇళ్ల పునాదుల ఫిల్లింగ్ కోసం, లేఅవుట్‌లను చదును చేసేందుకు నల్లరాయి, ఎర్ర రాయి, గ్రావెల్‌ను విక్రయిస్తున్నారు. రోజూ వందలాది లారీలకు వక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అంతేకాకుండా సీసీ రోడ్లు వేసే ముందు గ్రావెల్‌తో కప్పుతారు. దాని కోసం కూడా పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు. మొత్తానికి కీలక నేత అండతో రూ. కోట్లలో తమ్ముళ్లు ఆర్జిస్తున్నారు.
కొండలను తవ్వి ఆక్రమణ
మండలంలోని కొండలను తవ్వి, ఆ తర్వాత చదును చేసి ఆక్రమించుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. వందలాది ఎకరాలు ఈ రకంగా అక్రమార్కుల గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. ఇప్పుడా భూ ములను చూపించి క్వారీలు, క్రషర్ల ఏర్పాటు కో సం అనుమతులకు యత్నిస్తున్నారు. ప్రస్తుతానికై తే ఆ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అనుమతులు రాకపోయినా తమ పని మాత్రం కానిచ్చేస్తున్నారు. వందలాది ఎకరాల్లో గ్రావెల్ దోపిడీ చేస్తున్నారు. పొందూరు మండంలో ఎక్కడైతే కొండలు ఉన్నాయో అక్కడ పచ్చ గెద్దలు వాలిపోతున్నాయి. రూ. కోట్లలో సొమ్ము చేసుకుంటున్నాయి.
చెక్ పోస్టుకు సిఫార్సు చేసినా..
పొందూరు మండలంలో జరుగుతున్న గ్రావెల్ దోపిడీని అడ్డుకోవాలంటే చెక్ పోస్టు శరణ్యమని ఇక్కడ అధికారులు జిల్లా ఉన్నతాధికారులకు గతంలో నివేదిక ఇచ్చారు. అక్రమ క్వారీలు, తవ్వకాలు, రవాణాను తాము నియంత్రించలేమని, పరిస్థితి చేయి దాటిపోయిందని, రహదారి మార్గంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తే కనీసం రవాణానైనా అడ్డుకుని తద్వారా అక్రమ తవ్వకాలు నిలువరించవచ్చని మండల అధికారులు తమ నివేదికలో వి వరించారు. కానీ ఏ రకమైన ఒత్తిళ్లు ఉన్నాయో తెలి యదు గానీ చెక్ పోస్టు ఏర్పాటు ఊసేలేదు. మండల అధికారులు ఇచ్చిన నివేదిక ముందుకెళ్లలేదు. చెప్పాలంటే తుంగలోకి తొక్కేసినట్టు స్పష్టమవుతోంది.
విధ్వంసం జరుగుతున్నా..
అక్రమంగా నడుస్తున్న క్వారీల్లో ఇప్పటికే అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. దాదాపు ఎనిమి ది మంది వరకు మృత్యువాత పట్టారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. అంతేకాకుండా అక్రమ క్వారీ ల సమాచారాన్ని బయటపెట్టాలని చూసిన కొందరు లారీల కింద సమాధి అయ్యారు. అంత దారుణాలు ఇక్కడ చోటు చేసుకున్నాయి. ఇక, గ్రావెల్ రవాణా లారీలతో రోడ్లు ధ్వంసమవుతున్నాయి. క్వారీ తవ్వకాలతో గ్రామాలు కాలుష్యం బారిన ప డుతున్నాయి. ఇంత జరుగుతున్నా అడ్డుకునే నాథు డు లేకుండా పోయారు. దట్టమైన కొండలు కావడంతో అక్కడికి వెళ్తే మైనింగ్ మాఫియా చేతులో ఏమవుతామో అన్న భయం పట్టుకుంది. అధికారు లు సైతం అక్కడికి వెళ్లడానికి హడలెత్తిపోతున్నారు. అసలే నిర్మానుష్య ప్రదేశం, మరోవైపు కీలక నేత అండదండలు ఉండటంతో వెనక్కి తగ్గిపోతున్నారు.
పొందూరు మండలంలో తరిగిపోతున్న కొండలు
అడ్డగోలుగా తవ్వకాలు
ఇష్టారాజ్యంగా గ్రావెల్ దోపిడీ
తవ్విన ప్రాంతాన్ని చదును చేసి గుప్పెట్లోకి తెచ్చుకునే యత్నం


