● ఉమ్‌లింగ్‌లా శిఖరాన్ని అధిరోహించిన కిశోర్
● జిల్లా నుంచి బైక్‌పై సాహస యాత్ర చేసిన యువకుడు
రణస్థలం:రణస్థలం మండలంలోని పతివాడపాలెం గ్రామానికి చెందిన పతివాడ కిశోర్ సాహస యాత్ర చేశాడు. ఉమ్‌లింగ్‌లా శిఖరాన్ని అధిరోహించాడు. ఇది ప్రపంచంలోనే ఎత్తైన మోటారు వాహనాలు తిరగగలిగే ప్రదేశం. లఢక్ ప్రాంతంలో ఉంటుంది. ఏప్రిల్ 18న కిశోర్ ఈ సాహస యాత్ర మొదలుపెట్టాడు. ఈ నెల 5వ తేదీన అక్కడకు క్షేమంగా చేరుకున్నాడు. లఢక్ ప్రాంతం నుంచి ఉమ్ లింగ్ లా చేరుకునేందుకు ఎన్నో అవాంతరాలు ఎదురైనా అన్నీ తట్టుకుని గమ్యస్థానం చేరుకున్నాడు. జిల్లా నుంచి మొట్టమొదటి సారిగా అంతదూరం సాహసయాత్ర చేసిన వ్యక్తిగా నిలిచాడు. కిశోర్ తల్లిదండ్రు లు పతివాడ కమల, పతివాడ నర్సింహమూర్తి వ్యవసాయ కూలీలు. కిశోర్ ఇంటర్ వరకు చదువుకున్నాడు. కొండములగాం గ్రామానికి చెందిన మేనమామ లారీతో డ్రైవింగ్ వెళుతుంటానని చెప్పారు. అలాగే అప్పుడప్పుడు సాహసయాత్రలకు వెళ్లడం అలవాటుగా మార్చుకున్నట్లు తెలిపారు.
బైక్, సర్టిఫికెట్‌తో కిశోర్


