వంట గ్యాస్‌కీ తిప్పలు | - | Sakshi
Sakshi News home page

వంట గ్యాస్‌కీ తిప్పలు

Apr 15 2026 8:38 AM | Updated on Apr 15 2026 8:38 AM

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లాలో ఇప్పటివరకు కమర్షియల్‌ గ్యాస్‌కే ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పు డు ఇంటిలో వంట గ్యాస్‌కు కూడా తిప్పలు తప్పడం లేదు. ఇదే అదనుగా కొన్ని గ్యాస్‌ ఏజెన్సీలు సొమ్ము చేసుకుంటున్నాయి. ఇప్పటికే జిల్లాలో చాలా దుకాణాలు, హొటళ్లు, ప్రైవేటు వసతి గృహాలు, ఇలా పలు వ్యాపార కేంద్రాలు మూతపడ్డాయి. అయితే ప్రభుత్వం, గ్యాస్‌ కంపెనీల అధికారులు గృహావసర వంటగ్యాస్‌ కొరత లేదని ప్రకటనలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు వంట గా్‌య్స్‌కు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సిలిండర్లు ప్రైవే టు మార్కెట్‌కు వెళ్లిపోతుండడం, అధిక ధరలకు అడ్డగోలుగా విక్రయిస్తుండడం కనిపిస్తోంది. జిల్లా కేంద్రంలో బ్లాక్‌ మార్కెట్‌లో విరివిగా వంట గ్యాస్‌ సరఫరా అవుతోంది. ముఖ్యంగా నగరంలో కొత్తగా ఏర్పడిన రెండు ఏజెన్సీల్లో ఈ అక్రమాలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

గృహ అవసరాలకు సిలిండర్‌ ఆన్‌లైన్‌లో బుక్‌ చేసి మూడు వారాలు గడిచినా చాలా మందికి బండ అందలేదు. గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లోనే కొరత ఉంది. బ్లాక్‌ మార్కెట్‌ చీకటి వ్యాపారం కూడా పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువ స్థాయిలో జరుగుతోంది. ఇటీవల గ్యాస్‌ ఇవ్వడం లేదని ఇచ్ఛాపురానికి చెందిన వ్యాపారులు నేరుగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం నగరంలో రెండు మూడు ఏజెన్సీల్లో అడ్డగోలుగా బ్లాక్‌ మార్కెట్‌ విక్రయాలు జరుగుతున్నాయి. ఆ రెండు రాజకీయ నాయకులకు చెందినవి కావడంతో వాటి జోలికి అధికారులు వెళ్లడం లేదు. ఇందులో ఒక ఏజెన్సీ యజమాని స్థానికంగా ఉండరు. కేవలం సిబ్బందిపై ఆధారపడి ఈ ఏజెన్సీని నడపడంతో సిబ్బంది అడ్డగోలు ఆదాయానికి ఆశపడి అఽధిక ధరలకు విక్రయిస్తున్నారు.

ఫిర్యాదు చేసినా..

జిల్లా కేంద్రంలోని రెండు ఏజెన్సీలపై వందలాది ఫిర్యాదులు ఐవీఆర్‌ఎస్‌ ద్వారా వచ్చినా అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. దీంతో వారు ఇష్టారాజ్యంగా కమర్షియల్‌ సిలిండర్‌, డొమెస్టిక్‌ సిలిండర్‌ అనే తేడా లేకుండా ఒక్కో బండపై రూ.1500 నుంచి రూ.3000 వరకు అదనంగా వసూలు చేస్తూ అమ్మకాలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సమావేశమైనా ఉందా..?

గ్యాస్‌ కొరతతో జనం అల్లాడుతున్నా ఉన్నతాధికారులు, ఏజెన్సీ ప్రతినిధులు కనీసం సమావేశాలైనా నిర్వహించలేదు. సమస్యను పరిష్కరించే మార్గం వెతకడం లేదు. జిల్లాలో 39 గ్యాస్‌ ఏజెన్సీలు ఉన్నా యి. ప్రధానంగా బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, ఐఓసిఎల్‌ వంటి సంస్థలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 6,92,825 గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో సగటున ప్రతి వారంలో 13 వేలు వరకు బండలు అవసరం ఉంది. అయితే సిలిండర్ల కొతర చూపడంలో వినియోగదారులు అధికంగా బక్‌ చేయడంతో సమస్యలు వస్తున్నాయి. గడువును నిర్ణయించడంతో కూడా వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.

బుక్‌ చేసిన మూడు వారాలైనా

అందని గ్యాస్‌

బ్లాక్‌ మార్కెట్‌లో అధిక ధరకు వంట గ్యాస్‌

స్పందించని అధికారులు

Advertisement
 
Advertisement
Advertisement