సిబ్బందికి ఇబ్బంది | - | Sakshi
Sakshi News home page

సిబ్బందికి ఇబ్బంది

Apr 14 2026 9:04 AM | Updated on Apr 14 2026 9:04 AM

సిబ్బందికి ఇబ్బంది

శ్రీకాకుళం: ప్రజా ప్రతినిధుల ప్రచార ఆర్భాటాలు సిబ్బందికి తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. తాజాగా కేంద్ర మంత్రి జిల్లా కేంద్రంలో పలు పనులను ప్రారంభించి బైక్‌ నడిపారు. ఆయన బైక్‌పై కలెక్టర్‌ కూడా ఉన్నారు. ఆపక్కనే ఎమ్మెల్యే గొండు శంకర్‌ కూడా బండి తీశారు. దీంతో వీరికి భద్రత కల్పించాల్సిన వారు ద్విచక్ర వాహనాల వెనుక కిలో మీటర్‌ మేర పరుగులు పెట్టారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు ఇటీవల ప్రయాణికులు ఉన్న ఓ బస్సును నడిపారు. టెక్కలిలో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కూడా బైక్‌ నడుపుతుంటారు. వీరి ప్రచార ఆర్భాటం భద్రత సిబ్బందికి సవాల్‌ విసురు తోంది. దీన్ని పర్యవేక్షించాల్సిన అధికారులు కూడా ప్రజాప్రతినిధులకు ఈ విషయాన్ని చెప్పలేకపోతున్నారు. ఇటీవల సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు పెరగడంతో వారితో పాటు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement