
పిల్లలకు ప్రత్యక్ష నరకం
ప్రతిపాదనలు పంపించాం
నరకం చూస్తున్నాం
వర్షం వస్తే ఇబ్బందులు
● ఆరుబయట భోజనాలతో అవస్థలు ● వసతులు లేకపోవడంతో ఇబ్బందులు ● పట్టించుకోని అధికారులు
కొత్తూరు:
ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన వసతులు కల్పిస్తున్నామని కూటమి నాయకులు చెబుతున్న మాటలు నీటి మూటలుగా మిగులుతున్నాయి. కనీసం మధ్యాహ్న భోజనాలకు సంబంధించి భోజన శాలలు లేకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. దీంతో సక్రమంగా తినలేక అనారోగ్యాల బారిన పడుతున్నారు. జిల్లాలోని 30 మండలాల్లో 2,955 ప్రభుత్వ పాఠశాలలు, 38 ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 1,62,000 మంది, కాలేజీల్లో 12,500 మంది విద్యార్థులు ప్రతిరోజూ మధ్యాహ్న భోజనాలు చేస్తున్నారు. అయితే చాలా పాఠశాలల్లో భోజనశాలలు లేకపోవడంతో ఆరుబయట మైదానాల్లో, తరగతి గదుల్లో, పాఠశాల వరండాల్లో భోజనాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఈవిధంగా భోజనాలు చేయడం వలన కుక్కలతో ఇబ్బందులు తప్పడం లేదు. వర్షాలు పడితే భోజనం చేసేందుకు అగచాట్లు పడుతున్నారు. కొత్తూరుతో పాటు మండలంలోని మినీ గురుకుల పాఠశాలలో వడ్డించేందుకు గదులు లేకపోవడంతో ఆరుబయటే అన్నం వడ్డిస్తున్నారు. కొత్తూరులో చెట్టు నీడలో వడ్డన చేయడంతో పక్షుల రెట్టలు పడుతున్నాయి. కారిగూడ మినీ గురుకులంలో రెండు తరగతి గదులు మాత్రమే ఉన్నాయి. దీంతో విద్యార్థులు తరగతి గదుల్లో భోజనాలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరికొన్న పాఠశాలలు, కాలేజీల్లో స్థలం లేకపోవడంతో నిలబడి ప్లేట్లు పట్టుకొని భోజనం చేస్తున్నారు. దీంతో విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి వసతులు కల్పించాలని కోరుతున్నారు.
పాఠశాలల్లో భోజనశాలలు లేకపోవడంతో విద్యార్ధులు పడుతున్న సమస్య మా దృష్టికి వచ్చింది. భోజన శాలల మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాము. వీలైనంత వేగం సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం.
– రవిబాబు, డీఈవో, శ్రీకాకుళం జిల్లా
భోజన శాలలు లేకపోవ డంతో భోజనాలు చేసేందుకు ఇక్కట్లు పడుతున్నా ము. చెట్టు నీడలో భోజనా లు వడ్డిస్తుండడం వలన పక్షులు రెట్టలు వేస్తున్నాయి. దీంతో భోజనాలు చేసేందుకు నరకం అనుభవిస్తున్నాము.
– చిగురుపిల్లి సంధ్య, ఇంటర్మీడియట్
ద్వితీయ సంవత్సరం, కొత్తూరు
వంట శాలలు లేకపోవడంతో మైదానంలో భోజనా లు చేస్తున్నాము. వర్షాలు వచ్చినప్పుడు భోజనాలు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నాము. భోజన సమయంలో కుక్కలు వస్తున్నాయి. చెట్టుకిందనే వడ్డన చేయడం వల న పక్షులు రెట్టలు వేస్తున్నాయి. వీటితో ఆందోళ న చెందుతున్నాం. త్వరితగతిన భోజన శాల నిర్మించాలి. – ఎల్.సాయికుమార్,
తొమ్మిదో తరగతి, కొత్తూరు ఉన్నత పాఠశాల

పిల్లలకు ప్రత్యక్ష నరకం

పిల్లలకు ప్రత్యక్ష నరకం

పిల్లలకు ప్రత్యక్ష నరకం