ఆదిత్యుని సన్నిధిలో హైకోర్టు జడ్జి జస్టిస్‌ సుబ్బారెడ్డి | - | Sakshi
Sakshi News home page

ఆదిత్యుని సన్నిధిలో హైకోర్టు జడ్జి జస్టిస్‌ సుబ్బారెడ్డి

Sep 22 2025 8:04 AM | Updated on Sep 22 2025 8:04 AM

ఆదిత్

ఆదిత్యుని సన్నిధిలో హైకోర్టు జడ్జి జస్టిస్‌ సుబ్బారెడ్

అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణస్వామిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుబ్బారెడ్డి సత్తి ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ఈవో కె.ఎన్‌.వి.డి.వి.ప్రసాద్‌, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మలు పూర్ణకుంభ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. ఆలయ విశిష్టతను వివరిస్తూ.. గోత్రనామాలతో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనివెట్టి మండపంలో వేదాశీర్వచనం చేయించి తీర్థప్రసాదాలె అందజేసారు. ఈయన వెంట జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్‌ అహ్మద్‌ మౌలానా, ప్రోటోకాల్‌ సిబ్బంది ఉన్నారు.

మహిళలపై దాడులు అరికట్టాలి

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే సుగాలి ప్రీతి కేసు విచారణకు తొలి సంతకం చేస్తానన్న హామీ ఏమైందని ఎస్‌ఎఫ్‌ఐ మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్‌ సీహెచ్‌ పావని ప్రశ్నించారు. శ్రీకాకుళం నగరంలో ప్రజా సంఘాల కార్యాలయంలో ఆదివారం నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులపై జరుగుతున్న దాడులను, వేధింపులను అడ్డుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులకు శానిటరీ ప్యాడ్స్‌ సరఫరా చేయాలన్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ సరికాదన్నారు. అనంతరం జిల్లా గర్ల్స్‌ కన్వీనింగ్‌ కన్వీనర్‌గా పి.దివ్య, కో–కన్వీనర్‌గా నందినిలను నియమించారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్‌ పి.పవిత్ర, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సాఫ్ట్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా రమణారావు

పాతపట్నం: జిల్లా సాఫ్ట్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడిగా శ్రీరాం రమణారావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం పాతపట్నం గిరిజన సామాజిక భవనంలో అసోసియేషన్‌ జిల్లా కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు. ఉపాధ్యక్షుడిగా గురాడి అప్పన్న, సెక్రటరీగా జన్నివలస షణ్ముఖరావు, జాయింట్‌ సెక్రటరీగాఎన్ని దిలిప్‌కుమార్‌, ట్రెజరర్‌గా జమ్ము లోకేశ్వరరావు, సలహాదారుడిగా మాణిక్యాలరావులతో పాటు సభ్యులను ఎన్నుకున్నట్లు రాష్ట్ర వ్యాయామ సంఘం అధ్యక్షుడు ఎన్ని శేఖర్‌బాబు తెలిపారు. వీరిని పాతపట్నం డిగ్రీ కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ కొండాల చక్రపతి, పీడీలు, పీఈటీలు అభినందించారు.

నాయీ బ్రాహ్మణులను కించపరచడం తగదు

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): నాయి బ్రాహ్మణ కులాన్ని ఎగతాళి చేసి కించపరిచేలా మాట్లాడిన బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని నాయీ బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొరుపూరు గజపతిరావు, ఎస్‌.వి.జగన్నాథం ఆదివారం డిమాండ్‌ చేశారు. ఇప్పటికే రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, విద్య, ఉద్యోగాలలో వెనుకబడి ఉన్న తమ కులాన్ని కించపరచడం భావ్యం కాదన్నారు. సమాజంలో నాయీ బ్రాహ్మణుల పాత్ర అత్యంత విలువైందని, గ్రామాలు విడిచి పట్టణ ప్రాంతానికి వలసపోయే పరిస్థితుల్ని కొందరు రాజకీయ నాయకులు అగ్రకుల దురంహకారులు తీసుకొస్తున్నారని దుయ్యబట్టారు.

సమాజానికి

వెలుగుజాడ గురజాడ

శ్రీకాకుళం అర్బన్‌: సమాజ జాగృతికి వెలుగు జాడ మహాకవి గురజాడ అప్పారావు అని గాంధీ మందిర కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. తన రచనలతో సమాజాన్ని మేల్కొలిపిన మహాకవి గురజాడ జయంతి వేడుకలు ఆదివారం శ్రీకాకుళం నగరంలోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధులు సంఘసంస్కర్తల స్మృతి వనంలో ఘనంగా నిర్వహించారు. విగ్రహ దాతలు జామి భీమశంకర్‌, పత్తి సుమతి, గాంధీ మందిర కమిటీ ప్రతినిధులు వావిలపల్లి జగన్నాథం నాయుడు, ప్రొఫెసర్‌ డి.విష్ణుమూర్తి, నక్క శంకరరావు, కొమ్ము రమణమూర్తి తదితరులు గురజాడ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులోయ్‌ అని చాటి చెప్పిన గురజాడ స్ఫూర్తి సజీవంగా నిలిచి ఉంటుందన్నారు. కార్యక్రమంలో జి.నాగేశ్వరరావు, మెట్ట అనంతం భట్లు, శాస్త్రి, సువ్వారి రాజారావు తదితరులు పాల్గొన్నారు.

ఆదిత్యుని సన్నిధిలో  హైకోర్టు జడ్జి జస్టిస్‌ సుబ్బారెడ్1
1/3

ఆదిత్యుని సన్నిధిలో హైకోర్టు జడ్జి జస్టిస్‌ సుబ్బారెడ్

ఆదిత్యుని సన్నిధిలో  హైకోర్టు జడ్జి జస్టిస్‌ సుబ్బారెడ్2
2/3

ఆదిత్యుని సన్నిధిలో హైకోర్టు జడ్జి జస్టిస్‌ సుబ్బారెడ్

ఆదిత్యుని సన్నిధిలో  హైకోర్టు జడ్జి జస్టిస్‌ సుబ్బారెడ్3
3/3

ఆదిత్యుని సన్నిధిలో హైకోర్టు జడ్జి జస్టిస్‌ సుబ్బారెడ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement