
కలెక్టర్ దృష్టికి విద్యారంగ సమస్యలు
శ్రీకాకుళం: జిల్లాలో విద్యారంగ సమస్యలపై ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు ఆదివారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌తో చర్చించారు. కుప్పిలి పరీక్ష కేంద్రంపై అప్పటి డీఈఓ తిరుమల చైతన్య ఉద్దేశపూర్వకంగా ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం తెలియజేశారని, 15 మంది ఉపాధ్యాయుల సస్పెన్షన్‌కు కారణమయ్యారని పేర్కొన్నారు. సస్పెన్షన్ వెనువెంటనే ఎత్తివేసినా ఉపాధ్యాయులపై ఇంకా చార్జెస్ పెండింగ్స్ ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని కోరారు. ఇచ్ఛాపురం మండలం డొంకూరు, కొరిగాం హైస్కూల్ విద్యార్థులకు తాగునీటి సదుపాయం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కలెక్టర్ను కలిసిన వారిలో పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు తంగి మురళీమోహనరావు, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పప్పల రాజశేఖర్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు బత్తుల రవికుమార్, నాయకులు వి.హరిశ్చంద్రుడు జి.సిగడాం మండల శాఖ అధ్యక్షుడు లాడే చంద్రశేఖరరావు, లావేరు మండల శాఖ అధ్యక్షుడు మెండ నీలంకుమార్, భామిని మండల శాఖ ప్రతినిధి ముద్దాడ చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు.
వెటరన్ క్రికెటర్ నురేన్ హక్ మృతికి సంతాపం
శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం నగరానికి చెందిన సీనియర్ మాజీ వెటరన్ క్రికెటర్ మహమ్మద్ నురేన్ హక్ ఆదివారం బెంగళూరులోని ఓ హాస్పటల్‌లో తుదిశ్వాస విడిచారు. చంపాగల్లి వీధికి చెందిన నురేన్ హక్ పాతతరం క్రికెటర్లలో ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందారు. నార్త్‌జోన్, జోనల్ స్థాయి వరకు ప్రాతినిధ్యం వహించారు. 1994 నుంచి 1999 వరకు జిల్లా క్రికెట్ సంఘం సెక్రటరీగా వ్యవహరించారు. ఈయన మృతిపట్ల మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా క్రికెట్ సంఘ అధ్యక్షుడు పీవైఎన్ శాస్త్రి, హజన్‌రాజా షేక్, మెంటార్ ఇలియాస్ అహ్మద్, కోశాధికారి మదీనా శైలానీ, కౌన్సెలర్ డాక్టర్ ఎస్.రవికుమార్, ఆర్సీరెడ్డి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.
కూలిన గోడ.. తప్పిన ప్రమాదం
మెళియాపుట్టి: పరశురాంపురం పంచాయతీ నందవ గ్రామంలో సవర చిన్నలక్ష్మయ్య ఇంటి మట్టిగోడ కూలిపోయింది. ఆదివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి గోడ తడిసిపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో కుటుంబసభ్యులంతా అదే ఇంట్లోఉన్నారు. గోడ బయటవైపు పడిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అధికారులు పరిశీలించి సాయం అందించాలని బాధితుడు కోరారు.

కలెక్టర్ దృష్టికి విద్యారంగ సమస్యలు

కలెక్టర్ దృష్టికి విద్యారంగ సమస్యలు