
విద్యుత్ షాక్‌తో బాలికకు తీవ్రగాయాలు
కవిటి: మండలంలోని సీహెచ్ కపాసుకుద్ది గ్రామంలో విద్యుత్ షాక్‌తో మైలపల్లి తులసీ(13) అనే బాలిక తీవ్రంగా గాయపడింది. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం సాయంత్రం వీధిలో నుంచి బాలిక నడిచి వెళ్తుండగా ట్రాన్స్‌ఫార్మర్‌కు సమీపంలోని వర్షపునీటి మడుగుకు బాలిక కాలు తగలడంతో షాక్‌కు గురయ్యినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌కు ఏర్పాటు చేసిన ఎర్త్ సిస్టం వైఫల్యం కారణంగానే సమీపంలోని వరద నీటికి విద్యుత్ ప్రసరించిందన్నారు. వెంటనే కుటుంబ సభ్యులు, గ్రామస్తులు బాలికను కవిటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ బాలికకు ప్రథమ చికిత్స అందజేసి, మెరుగైన చికిత్స కోసం బరంపురం సిఫారుసు చేశారు. అయితే ట్రాన్స్‌ఫార్మర్ వద్ద తలెత్తిన ఈ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.