
స్కీమ్ కాదు.. అదో పెద్ద స్కామ్
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్
హామీలు నెరవేర్చకుండా అవినీతి
మహిళలకు కుట్టుమిషన్ల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం కోట్ల రూపాయల అవినీతికి ప్లాన్ వేసింది. తల్లికి వందనం, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇస్తానని హామీ ఇచ్చి చివరకు ఇలాంటి పనులు చేస్తున్నారు. హామీలు నెరవేర్చకుండా ఒకసారి మోసం చేశారు. అవినీతితో రెండోసారి మోసం చేస్తున్నారు. అన్ని వ్యవస్థల్లో అవినీతికి పాల్పడుతూ గుట్టు చప్పుడు కాకుండా కోట్లాది రూపాయలు కాజేయడం చంద్రబాబు నైజం. – పేరాడ తిలక్,
వైఎస్సార్ సీపీ టెక్కలి సమన్వయకర్త
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ)/ టెక్కలి: బీసీలంటే బ్యాక్‌వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్‌బోన్ అని నమ్మిన వ్యక్తి మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని ఎక్కడా ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా అర్హతే ప్రామాణికంగా నేరుగా లబ్ధిదారుని ఖాతాల్లోకే డబ్బులు జమ చేశారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. చంద్రబాబునాయుడికి మాత్రం స్కీమ్‌లు స్కామ్‌లతో సమానమని మండిపడ్డా రు. శ్రీకాకుళం నగరంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సోమవారం మీడియా తో ఆయన మాట్లాడారు. మహిళా దినోత్సవం నాడు ప్రారంభించిన కుట్టుమిషన్ల శిక్షణ స్కీమ్ లో రూ.150కోట్లు స్కామ్ చేయడం అన్యాయమ న్నారు. వాస్తవానికి ఒక్కో మహిళకు కుట్టుమిషన్ ఇచ్చేందుకు రూ.4300, శిక్షణకు రూ.3 వేలు మొత్తం రూ.7300 అవ్వగా టెండర్‌లో మాత్రం ఏకంగా రూ.21500 చూపించడం దారుణమన్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా లక్ష మందికి పైగా ఈ పథకానికి యూనిట్, శిక్షణ ఇవ్వడానికి అయిన ఖర్చు కేవలం రూ.75.06 కోట్లు పోగా మిగిలిన రూ.146.02కోట్లు స్వాహా చేసేశారన్నారు. ఈ శిక్షణ కేవలం 50రోజుల్లో పూర్తిచేసి మిగతా మొత్తాన్ని చంద్రబాబునాయుడు కోట రీ బొక్కేయడం సరికాదన్నారు.
కమ్మ, క్షత్రియ, కాపు, ఆర్యవైశ్య కులాలకు కుట్టు మిషన్ల పంపిణీ అంటూ రూ.115 కోట్లకు టెండర్లు పిలిచి అందులో మరో రూ.81.05 కోట్లు స్కామ్ చేశారని ఆరోపించారు. బీసీ కార్పొరేషన్ లోన్ల కోసం టీడీపీ నేతల వెనక తిరగాల్సి వస్తోందని, వైఎస్సార్ సీపీ హయాంలో ఈ దుస్థితి ఉండేది కాదని అన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి మధ్య తేడాను గమనించాలన్నారు.
కళింగవైశ్య కుల, తూర్పుకాపు, కాళింగ కుల రాష్ట్ర అధ్యక్షులు అంధవరపు సూరిబాబు, మామిడి శ్రీకాంత్, దుంపల లక్ష్మణరావు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం మాట్లాడుతూ 56 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లు, డైరెక్టర్లను నియమించి బీసీ సంక్షేమాన్ని వైఎస్ జగన్ గొప్పగా నిర్వర్తించారని గుర్తు చేశారు. అర్హతే ప్రామాణికంగా తీసుకుని అందరికీ సంక్షేమ పథకాలు అందించామన్నారు. బీసీలకు లోన్లు, కుట్టుమిషన్ల పేరు తో ఈ ప్రభుత్వం స్కామ్ చేస్తోందని దుయ్యబట్టారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిల్లి వెంకట సత్యనారాయణ, గ్రీవెన్స్‌సెల్ అధ్యక్షుడు రౌతు శంకరరావు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ గొండు కృష్ణ, సాధు వైకుంఠరావు, గొండు రఘురాం, రాజాపు అప్పన్న, గుప్తా, బొబ్బాది ఈశ్వరరావు, భార్గరావు, తంగి అప్పన్నస్వామి తదితరులు పాల్గొన్నారు.
కూటమి స్కామ్‌లతో ఖజానా ఖాళీ
కూటమి స్కామ్‌లతో ఖజానా ఖాళీ అవుతోంది. దాదాపు రూ.150 కోట్ల నిధులను దోపిడీ చేశారు. టెండర్ల దశ నుంచే అక్రమాలు జరిగాయి. రాష్ట్రంలోని బీసీ కార్యకర్తలు, బీసీ మహిళా సంఘాలు దీనిపై దృష్టి సారించాలి.
–దుంపల లక్ష్మణరావు, వైఎస్సార్‌సీపీ కాళింగ కుల రాష్ట్ర అధ్యక్షుడు
బీసీ రుణాల పేరుతో కూటమి నేతలు జేబులు నింపుకుంటున్నారు
బీసీలను ఆదుకున్నది వైఎస్సార్, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మాత్రమే
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్

స్కీమ్ కాదు.. అదో పెద్ద స్కామ్

స్కీమ్ కాదు.. అదో పెద్ద స్కామ్