
ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి
పలాస : కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్‌ను ఆపి వెంటనే కాల్పుల విరమణ ప్రకటించాలని సి.పి.ఐ.ఎం.ఎల్ న్యూడెమొక్రసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు వివిధ ప్రజా సంఘాలతో కలిసి శుక్రవారం పలాస ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటి వరకు దండకారణ్యంలో ఆదివాసీలు సుమారు 400 మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టు పార్టీ నాయకులను, కార్యకర్తలను భౌతికంగా నిర్మూలించే కార్యక్రమం చేపట్టడం అప్రజాస్వామ్యమన్నారు. కర్రెగుట్ట కొండలను జల్లెడ పడుతున్నారని, అన్నిరకాల భద్రతా బలగాలను ఈ ఆపరేషన్‌కు వినియోగించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో న్యూడెమొక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, చాపర వేణు, కొర్రాయి నీలకంఠం, పోతనపల్లి అరుణ, లక్ష్మణరావు, పుచ్చ దుర్యోధనరావు, మద్దిల రామారావు, ఎం.వినోద్, గొరకల బాలకృష్ణ, వంకల పాపయ్య, మామిడి భీమారావు, రాపాక మాధవరావు, జడ్డే అప్పయ్య, పోతనపల్లి కుసుమ, బర్ల గోపి, ఎస్.రామారావు తదితరులు పాల్గొన్నారు.